సూర్యుడు మకర రాశి లో ప్రవేశించే పుణ్య ఘడియల్లో ఉత్తరాయణ పుణ్య కాలం ఆరంభం. సంక్రాతి లేదా సంక్రమణం అంటే చేరడం లేదా మారడం అని అర్ధం. సూర్యుడు మేషాది ద్వాదాస రాశుల యందు క్రమంగా పూర్వ రాశి నుండి ఉత్తర రాశి లోకి ప్రవేశించడమే సంక్రాతి. ఆయనం అనగా పయనించడం ఉత్తర ఆయనం అంటే ఉత్తరం వైపు పయనించడం అని అర్ధం.
సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమి పై వాతావరణం లో మార్పులు సంభవిస్తాయి. సూర్యుడు సంవత్సరం లో ఆరు నెలలు ఒక వైపు అనగా దక్షిణ వైపు మరో ఆరు నెలలు ఒక వైపు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు. దేవమార్గం ప్రారంభమయ్యే రోజు. ఈ రోజు చేసే స్నానాలు, దానాలు, జపాలు, వ్రతాలు విశేష ఫలితాలనిస్తాయి. సంక్రాంతి రోజు గుమ్మడి కాయ వస్త్రములు దానం చేయడం ఆచారం. విష్ణు సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి. దేవ పితృ దేవతలనుద్దేసించి చేసే తర్పణాలు, దానాలు పుణ్యప్రదం. పౌష్య లక్ష్మిగా అమ్మవారి ని ఆరాధించే సమయం. సంక్రాంతి రోజు స్నానం చేయని వారికి రోగాదులు వస్తాయని ధర్మశాస్త్రం ద్వారా తెలుస్తుంది. సంక్రాంతి రోజు దేవతలకు, పితృదేవతలకు, పాత్రులకు ఏ ఏ దానాలు చేస్తామో అవి జన్మజన్మలకి అత్యధికం గా లభిస్తాయని ప్రతీతి. ఈ పుణ్య కాలం లో తిలలు, బియ్యం కలిపి శివారాధన చేయడం,ఆవు నేతి తో అభిషేకం చేయడం, నువ్వుల నూనె తో దీపం వెలిగించడం చాలా శ్రేష్ఠమైనది. నల్ల నువ్వులతో పితృతర్పణాలు ముఖ్యం గా ఆచరించవలసిన విధి. సంకరమణం నాడు ఒంటి పూజ భోజనం చేయాలి. దేవతలకు పితృదేవతల పూజలకు పుణ్యకాలం. మంత్ర జపాలు, ధ్యానం, పారాయణం విశిష్ఠ ఫలితాలని శీఘ్రంగా ప్రసాదించే కాల మహిమ సంక్రమణానికి ఉంది.
ఉత్తరాయణం లో ముఖ్యం గా చేయవలసినవీ నాదీ స్నానం, సూర్య నమస్కారాలు, వేదాధ్యయనం, నూతన గృహ ప్రవేశం, ఉపనయనం, వివాహం, వంటి పుణ్య కార్యాలు. గంగా, యమున, గోదావారి వంటి నాదీ స్నానాలు ఆచరించడం. నువ్వులు, బియ్యం, వస్త్రాలు, దుంపలు, ఫలాలు, చెరుకు, విసన కర్ర, బంగారం, గోవు వంటివి దానం చేయడం వలన ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గుమ్మడి కాయను దానం చేస్తే సాక్షాత్తు బ్రహ్మ్హ్యాండాన్నే దానం చేసిన ఫలం ప్రాప్తిస్తుంది