నరకచతుర్దశి మరియు దీపావళి విశిష్ఠత
ఆశ్వయుజ బహుళ చతుర్దశి నరక చతుర్దశి - ఈరోజున గడ్డి తో చేసిన నరకాసురుని బొమ్మను కాల్చిన తర్వాత నువ్వుల నూనె తో అభ్యంగన స్నానం ఆచరించాలి. ఈ రోజున నూనె లో లక్ష్మి దేవి, నీళ్ళలో గంగ ఉంటుంది. అందుకే ఈ రోజు ఆచరించే స్నానవిధి ప్రసాస్థ్యమైనది. నరకచతుర్దశి నాడు సూర్యోదయానికి ముందే స్నానం చేయడం వల్ల యమలోకానికి వెళ్ళే అవసరం ఉండదని బ్రహ్మపురాణ ఆధారం గా తెలుస్తుంది. నరక చతుర్దశి నాడు సూర్యోదయం తర్వాత స్నానమాచరిస్తే వారి గత సంవత్సరపు పుణ్యకార్యాల సత్ఫలం నశిస్తుందని భవిష్యపురాణం ద్వారా తెలుస్తుంది. పెద్దలు పేరు తలచుకొని దీపాలు వెలిగిస్తారు. ఆ దీపాల వెలుగు పితృ లోకాల్లో ఉన్న వారికి స్వర్గానికి చేరుకునేలా దారిని చూపుతూ చేయడం ఈ విధి యొక్క భావం.
ఆశ్వయుజ కృష్ణచతుర్దశి, అమావాస్య, దీపావళి రోజున ఎవరైతే లక్ష్మీ దేవిని ఆహ్వానిస్తూ తమ ఇళ్ళలో దీపాలతో పండుగ జరుపుకొంటారో వారికి లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడు ఉంటుంది. దీపావళి నాడు లక్ష్మీ తిల తైలం లో ఉంటుందనీ, తలంటి స్నానం చేయడం లక్ష్మీప్రదమని ఈనాటి స్నానం గంగా స్నానం తో సమానమని శాస్త్ర వచనం, లక్ష్మీ దేవి ప్రతి ఇంటికి తిరిగి శుభ్రం గా ఉన్న ఇంట్లో తన కళను నిక్షిప్తం చేస్తుందని, భక్తి శ్రద్దలతో పూజించి ఎవరైతే దీపాలతో స్వాగతించి దారి చూపి ఆహ్వానిస్తారో వారి పై ప్రసన్నురాలై సంపదలను అనుగ్రహిస్తుంది అని భక్తుల విశ్వాసం. దీపాలు సమృద్దిగా వెలిగే ఇంట లక్ష్మీ ప్రవేశిస్తుంది. అజ్ఞానందకారాన్ని తొలగించి జ్ఞానప్రకాశాన్ని విస్తరింపజేసే పండుగగా దీపావళి ని హిందూ సంస్కృతి భావిస్తుంది.దీపావళి రోజున ప్రముఖం గా స్వాతి నక్షత్రం ఉంటుంది. ఈ నక్షత్రం ఉన్న రోజున స్నానం విశేష ఫలితాన్నిస్తుంది. ఈరోజు చేసే అభ్యంగన స్నానం లక్ష్మీప్రదం. తైలం లో లక్ష్మి నీటి లో గంగ ఉంటుందని శాస్త్ర వచనం. మధ్యాహ్నం వేళ పితృదేవతలను ఉద్దేశించి పార్వణ శ్రాద్ధం చేస్తారు. సంధ్యా సమయం లో దీపాలు వెలిగించి లక్ష్మీపూజ చేస్తారు. చతుర్దశి మొదలు మూడు దినాలు ప్రదోషం లో మనోహరమైన దీపాలను దేవాలయం లోను, మఠం లోను, ప్రాకారాలలోను, వీధులందు, గోశాల మొదలైన వాని యందు ఉంచాలి ఇది పితరులకు క్షేమకరమైనది.
https://tinvale.pl