కుంభం...
------
ముఖ్య కార్యక్రమాలలో అవాంతరాలు తొలగి ముందుకు సాగుతారు.
ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీకు విధేయులుగా మారవచ్చు.
ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు.
ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు.
ఉత్సవాలకు హాజరవుతారు.
ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు.
అనుకున్నంత సొమ్ము మొదట్లో అందకపోయినా అవసరాలు తీరతాయి.
బంధువులు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకునేందుకు యత్నిస్తారు.
భార్యాభర్తల మధ్య అపోహలకు తెరపడుతుంది.
ఆరోగ్యం కుదుటపడి ప్రశాంతంగా కార్యక్రమాలు చేపడతారు.
వ్యాపారాలలో అనుకున్న లాభాలు గడిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు పొందుతారు.
పారిశ్రామిక, రాజకీయవేత్తలను విజయాలు వరిస్తాయి.
శ్రీ మేధా దక్షిణామూర్తి స్తుతి మంచిది.