కుంభం
రాబడి సంతృప్తినిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ పై ఏర్పాట్లు.
చిన్ననాటి స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు.
సేవలకు గుర్తింపు రాగలదు.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారమవుతాయి.
దూరపు బంధువులను కలుసుకుంటారు.
వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు కొంత నిదానిస్తాయి.
వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.
ఉద్యోగులకు కొత్త బాధ్యతలు మీదపడవచ్చు.
అయినా సమర్థతను చాటుకుంటారు.
పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.
కళాకారులు, పరిశోధకులకు కొత్త ఆశలు చిగురిస్తాయి.
వారం మధ్యలో దూర ప్రయాణాలు.
శారీరక రుగ్మతలు. స్నేహితులతో తగాదాలు.