మేషం (మార్చ్ 21 - ఏప్రిల్ 19)
సంవత్సర ప్రారంభం నుండి కూడా అన్ని విధాలా చక్కటి అభివృద్ధి మరియు చక్కటి మార్పులు వీరు గమనించవచ్చు
ఆర్దికపరమైనటువంటి ఎదుగుదల ఉంటుంది.
ఎప్పటి నుండి ప్రయత్నిస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
వ్యాపారస్తులు ఊహించినదానికన్నా అధికంగా ఆదాయం సంపాదిస్తారు
విద్యార్థులు కలలు నెరవేరే సమయం
కొన్ని పనులు నత్తనడకన సాగినప్పటికీ లేదా పెండింగ్ పడినప్పటికీ సెప్టెంబర్ తర్వాత నుండి పుంజుకొంటాయి
స్థిరాస్తులు కొనాలనుకునే వారు ఈ సంవత్సరం ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది
ఏ వృత్తి లో ఉన్న అవకాశాలని అందిపుచ్చుకొంటే చక్కటి విజయాలు నమోదు చేసుకోగలుగుతారు.
వీరికి ప్రత్యేకమైన సూచన ఏమిటంటే
అనవసరమైన విషయాలలో తలదూర్చడం వలన సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది ఈ విషయాన్నీ గుర్తుంచుకొని జాగ్రత్త గా ముందుకు వెళ్ళాలి అలాగే ప్రతి చిన్న విషయానికి చికాకు కోపం తగ్గించుకోవడం మంచిది