కర్కాటకం
కార్యజయం, నూతనోత్సాహం.
విలువైన వస్తువులు సేకరిస్తారు.
భూవివాదాలు తీరి ఊరట లభిస్తుంది.
కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.
శుభవార్తా శ్రవణం.
ఆదాయం పెరిగి ఉత్సాహంగా గడుపుతారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు ఆటుపోట్లు తొలగుతాయి.
ఉద్యోగులకు ప్రశంసలు తథ్యం.
పారిశ్రామికవేత్తలు, వైద్యులకు ఊహించని సన్మానాలు.
విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.
మహిళలకు సేవలకు గుర్తింపు లభిస్తుంది.
అనుకూల రంగులు... ఆకుపచ్చ, బంగారు.
ప్రతికూల రంగు...పసుపు.
శివాష్టకం పఠించండి.