కర్కాటకం
ప్రారంభంలో కొన్ని అవరోధాలు నెలకొన్నా అధిగమిస్తారు.
ఆత్మీయుల ప్రేమానురాగాలు లభిస్తాయి.
ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు.
పరిచయాలు పెరుగుతాయి.
పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.
వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు.
రాబడి ఆశాజనకంగా ఉండి రుణబాధలు తొలగుతాయి.
శుభకార్యాలపై చర్చలు జరుపుతారు.
బంధువులు కొత్త బాధ్యతలు అప్పగిస్తారు.
వ్యాపారులు విస్తరణ యత్నాలు ముమ్మరం చేస్తారు.
ఉద్యోగులకు ఉన్నత పోస్టులు రావచ్చు.
పారిశ్రామికవేత్తలకు ముఖ్య సమాచారం అందుతుంది.
క్రీడాకారులు, కళాకారులకు శుభవార్తలు.
వారాంతంలో సన్నిహితులతో తగాదాలు.
దూర ప్రయాణాలు.