మిథునం...
-------
పట్టుదలతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
మీ సత్తా చాటుకుని ఉద్యోగాలు దక్కించుకుంటారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.
సమాజంలో మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది.
మీ సేవాభావం అందర్నీ ఆకట్టుకుంటుంది.
పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు.
సొమ్ముకు లోటు ఉండదు. అనుకున్న సమయానికి సొమ్ము అందుతుంది.
కుటుంబంలో మీపై ఉంచిన బాధ్యతలు నేర్పుగా పూర్తి చేస్తారు.
బంధువులు తిరిగి దగ్గరవుతారు.
ఆరోగ్యం గతం కంటే మెరుగుపడి ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాలలో కోరుకున్న లాభాలు తథ్యం.
ఉద్యోగాలలో మరింత గుర్తింపు పొందుతారు.
క్రీడాకారులు, వైద్యులకు అన్ని విధాలా సానుకూలత ఉంటుంది.
శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.