మిథునం (మే 21 - జూన్ 20 )
ఈ సంవత్సరం చాలా మార్పులే సంభవిస్తాయి, అయితే అవి మంచి మార్పులే అవ్వడం విశేషం
కెరీర్ లో మంచి అవకాశాలు లభిస్తాయి
ఉద్యోగస్తులకు ప్రొమోషన్స్ కి అవకాశం కలదు
విద్యార్థులు అనుకొన్నది సాధించగలుగుతారు, విదేశాలకి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి.
వ్యక్తిగత జీవితం ఆనందం గా గడుస్తుంది.
వీరు పాటించవలసిన సూచన ఏమిటంటే
ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి, ఓర్పుని కోల్పోకండి
అసంతృప్తి ని వదిలి పెట్టి వచ్చిన దానితో, ఉన్నదానితో ఆనందం గా ఉండడం మంచిది
వీరు పాటించవలసినది
బుధవారం రోజు ఆవు కి పచ్చ గడ్డి తినిపించడం