సింహం
బంధువులతో గతం నుండి నెలకొన్న వివాదాలు సర్దుకుంటాయి.
భార్యాభర్తల మధ్య సఖ్యత ఏర్పడుతుంది.
రావలసిన బాకీలను సైతం అందుకుని అవసరాలు తీర్చుకుంటారు.
కొన్ని కార్యక్రమాలను శ్రమలేకుండానే పూర్తి చేస్తారు.
ముఖ్య నిర్ణయాలపై సర్వత్రా హర్షం వ్యక్తం కాగలదు.
వాహనాలు, ఖరీదైన∙స్థలాలు కొంటారు.
వ్యాపారవేత్తలు ఎదురుచూస్తున్న లాభాలు దక్కించుకుంటారు.
ఉద్యోగవర్గాలు బాధ్యతలు తేలిగ్గా పూర్తి చేస్తారు.
రాజకీయ, పారిశ్రామికవేత్తలకు సమస్యలు తీరే సమయం.
విద్యార్థులకు నూతనోత్సాహం, సంతోషకర సమాచారం.
మహిళలకు మానసిక ప్రశాంతత.
అనుకూల రంగులు.... కాఫీ, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...ఎరుపు.
గణేశాష్టకం పఠించండి.