సింహం...
--------
నిరుద్యోగులకు ఉద్యోగలాభం.
చేపట్టిన కార్యక్రమాలను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు.
వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు.
ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
ఎంతటి వారినైనా మీ నైపుణ్యంతో ఆకట్టుకుంటారు.
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గడుస్తుంది.
రెండుమూడు విధాలుగా ధనలాభ సూచనలున్నాయి.
మీపై కుటుంబసభ్యులు మరింత ఆదరణతో ఉంటారు.
బంధువుల రాకతో ఇంట్లో సందడిగా గడుస్తుంది.
ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించినా క్రమేపీ సర్దుకుంటుంది.
వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు.
ఉద్యోగాలలో మరింత గుర్తింపు పొందుతారు.
కళాకారులు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
శ్రీ అన్నపూర్ణాదేవి స్తోత్రాలు పఠించండి.