సింహం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
ఆత్మీయుల ఆదరణ, ప్రోత్సాహం అందుతాయి.
ఇంటిలో శుభకార్యాలపై చర్చలు జరుపుతారు.
ప్రముఖులతో పరిచయాలు.
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
విద్యార్థులకు కాస్త నిరాశ తప్పకపోవచ్చు.
ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు.
వ్యాపారాలు క్రమేపీ అభివృద్ధి పథంలో సాగుతాయి.
ఉద్యోగులకు ఒత్తిడులు పెరిగినా అధిగమించి ముందుకు సాగుతారు.
రాజకీయ, పారిశ్రామికవేత్తలు, కళాకారులకు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి.
వారారంభంలో ప్రయాణాలు వాయిదా.
సోదరులతో విభేదిస్తారు. శ్రమ తప్పదు.