సింహం (జులై 23 - ఆగష్టు 22)
పెద్దగా సమస్యలు ఏమి లేకుండా గడుస్తుంది, ఆశించరీతి లో ఉద్యోగం లో ఎదుగుదల ఉంటుంది.
కోరుకొన్న జాబ్ సాధించగలుగుతారు, వ్యాపారస్తులు కూడా అభివృద్ధి పథం లో సాగుతారు.
ఆదాయం పెరగడం వలన పొదుపు చేయటం కూడా ప్లాన్ చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి
అయినప్పటికీ, సంవత్సరం రెండో భాగం కొద్దిగా ఒడిదుడుకులు ఎదురుకోక తప్పదు. సమస్యలు క్రమంగా పెరిగే అవకాశం ఉంది. ఇది గమనించుకొని ఏ విషయాన్ని కూడా అశ్రద్ధ చేయకుండా ప్లాన్ చేసుకోవడం మంచిది
కానీ ఈ సమయం లో విదేశీ వ్యవహారాలు కలసి వస్తాయి.
బంధువుల వలన కొద్దిగా మానసిక అశాంతి కి గురవుతారు
ఆరోగ్య విషయం లో అశ్రద్ధ వహించరాదు.
ఆర్ధిక వ్యవహారాల లో తొందరపాటు వద్దు
కొత్త పరిచయాల విషయం లో జాగ్రత్త గా ఉండాలి
వీరు ముఖ్యం గా పాటించవలసినది
కొద్దిగా బెల్లం కుంకుమ కలిపి ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడం మంచిది
స్నానం చేసే నీటి లో కొద్దిగా పన్నీరుని కలుపుకోవడం మంచిది