తుల
కొత్త వ్యక్తుల పరిచయం.
శుభకార్యాల నిర్వహణ పై ఒక అంచనాకు వస్తారు.
ఆప్తులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది.
ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు.
ఆదాయానికి ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి.
ఉద్యోగులు ఉన్నత స్థాయివారితో పరిచయాలు పెంచుకుంటారు.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు సంస్థల నిర్వహణ పై శ్రద్ధ వహిస్తారు.
క్రీడాకారులు, వైద్యులకు అంచనాలు నిజం కాగలవు.
విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.
మహిళలకు శుభవార్తలు అందుతాయి.
అనుకూల రంగులు... కాఫీ, లేత ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...పసుపు.
ఆంజనేయ దండకం పఠించండి.