తుల
కొత్త వ్యక్తుల పరిచయంతో కొంత ఉత్సాహం వస్తుంది.
కొన్ని ముఖ్య కార్యక్రమాలకు హాజరవుతారు.
విద్యార్థులకు అనుకూల సమయం.
ఆత్మీయులు, శ్రేయోభిలాషుల శుభవార్తలు రావచ్చు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఆర్థిక విషయాలు మీకు కొంత ఊరటనిస్తాయి.
బంధువుల ద్వారా కూడా సాయం అందవచ్చు.
సోమ, మంగళ, శనివారాలు మాత్రం ప్రతిపైసా జాగ్రత్తగా ఖర్చు చేయండి.
ఎవరికీ హామీలు ఇవ్వవద్దు.
కుటుంబంలో మీ అభిప్రాయాలు గౌరవిస్తారు.
బంధువులు, సోదరులతో సఖ్యత.
భార్యాభర్తల మధ్య అపోహలు తొలగుతాయి.
సంతానం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
సోమ, మంగళవారాలు కొన్ని చికాకులు తప్పకపోవచ్చు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
స్థిరాస్తుల కొనుగోలుపై దృష్టి సారిస్తారు.
వ్యాపారులకు లాభాలు కొంత ఉత్సాహాన్నిస్తాయి.
భాగస్వాములతో మాత్రం ఆచితూచి వ్యవహరించడం మంచిది.
మధ్యలో కొన్ని పరిణామాలు చికాకు పరుస్తాయి.
ఉద్యోగాలలో ఒక సమాచారం ఊరటనిస్తుంది.
మీ అంచనాలు నిజం కాగల అవకాశాలు.
అయితే కొందరికి మార్పులు ఉండవచ్చు.
వైద్యులు,పారిశ్రామికవేత్తలు, కళాకారుల యత్నాలు సఫలం.
టెక్నికల్ రంగం వారికి సమతూకంగా గడుస్తుంది.
ఒత్తిడులు వచ్చినా తట్టుకునే రీతిలో మసలుకుంటే మంచిది.
మహిళలకు ఆస్తిలాభ సూచనలు.
దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.
శనివారం రావిచెట్టు చుట్టూ ప్రదక్షణలు చేయండి.