తుల
అనుకున్న కార్యాలు విజయవంతంగా సాగుతాయి.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.
జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు.
ఇంత కాలం పడిన శ్రమ ఫలిస్తుంది.
కష్టానికి తగ్గ ఫలితం కనిపిస్తుంది.
కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు.
వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి.
నిరుద్యోగుల కృషి కొంత ఫలిస్తుంది.
వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగస్తులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. విధుల్లో ప్రశంసలు.
పారిశ్రామికవర్గాలు, వ్యవసాయదారులకు కొత్త ఆశలు.
కళాకారులకు నిరాశ తొలగుతుంది.
వారం మధ్యలో బంధువులతో విభేదిస్తారు.
కుటుంబంలో సమస్యలు తప్పవు.