తుల ( సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22 )
ఉద్యోగస్తుల శ్రమని పనితనాన్ని పై స్థాయి వారు గుర్తిస్తారు, అందరి దగ్గర ప్రశంసలు అందుకొంటారు. ఎంత వేగం గా ప్రశంసలు అందుకొంటారో ఎక్కువ కాలం దీనిని ఆస్వాదించలేకపోతారు.
ఎవరు ఏ వృత్తి లో ఉన్నా ఛాలెంజెస్ ఎదురుకోవలసి వస్తుంది.
వీరి జీవితం లో ఈ సమయం లో చాలా మార్పులకి అవకాశం కలదు, మంచి చెడుల మిశ్రమం గా ఈ మార్పులు ఉంటాయి.
పెట్టుబడుల విషయం లో జాగ్రత్త వహించాలి, రిస్క్ చేయడం తొందరపడటం మంచిది కాదు.
సంవత్సరం ఆఖరు లో మీరు చేస్తున్న పనులలో విజయం సాధిస్తారు
సంబంధబాంధవ్యాలు విషయం లో కొంత చికాకులు తప్పవు
ఏదైనా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకొనేటప్పుడు తండ్రి సలహా కానీ లేక మీరు గురువు గా భావించే వారు పెద్దగా భావించే వారి సలహాలు తీసుకోవడం మంచిది
ముఖ్యం గా పాటించవలసిన సూచనలు
ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి
ఎటువంటి సందర్భాలలో ఓర్పు ని కోల్పోకండి.