మీనం....
-----
క్రమేపీ పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు.
మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం.
నేర్పుతో కొన్ని వివాదాలు, సమస్యలు పరిష్కరించకుంటారు.
ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు.
ఇంటి నిర్మాణయత్నాలను వేగవంతంగా చేస్తారు.
శ్రమపడ్డా తగిన ఫలితం పొందుతారు.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు.
చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
కొంత సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది.
అప్పుల బాధలు తొలగి ఊరట చెందుతారు.
కుటుంబంలో మీరంటే అందరూ ఇష్టపడతారు.
శుభకార్యాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతారు.
భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత ఏర్పడుతుంది.
ఆరోగ్యపరమైన చికాకులు నెలకొని ఇబ్బంది పడతారు.
వ్యాపారాలలో లాభాలకు లోటు రాదు. విస్తరించే కార్యక్రమాలు చేపడతారు.
ఉద్యోగాలలో మీ పనితీరుకు అందరూ ప్రశంసలు కురిపిస్తారు.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
శ్రీ ఆదిత్య హృదయం పఠించండి.