మీనం
కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మవిశ్వాసం సడలక ముందుకు సాగుతారు.
ఆర్థిక విషయాలు కాస్త ఊరటనిస్తాయి.
పలుకుబడి పెరుగుతుంది.చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారతారు.
కొన్ని కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.
గత సంఘటనలు గుర్తుకు వస్తాయి.
కాంట్రాక్టర్లకు అనుకూల సమయం.
కొన్ని వివాదాల నుంచి బయటపడతారు.
మీ నిర్ణయాలను అందరూ సమర్థిస్తారు.
వ్యాపార లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి.
ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.
పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కళాకారులు, పరిశోధకులకు అనుకూల సమయం.
వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు. అప్పులు చేస్తారు.
సన్నిహితుల నుంచి ఒత్తిళ్లు.