ధనుస్సు...
----
ముఖ్య కార్యక్రమాలు కొంత నిదానించినా పూర్తి చేసేవరకూ విశ్రమించరు.
మీ ప్రతిపాదనలు స్నేహితులు ఆమోదిస్తారు.
తీర్థయాత్రలు చేస్తారు.
పలుకుబడి మరింత పెరుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం.
నిరుద్యోగులకు ఉద్యోగయోగం కలుగుతుంది.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కొంత సొమ్ము అనుకున్న సమయానికి అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. అందరి అభిమానం పొందుతారు.
భార్యాభర్తల మధ్య గత కొంతకాలంగా నెలకొన్న వివాదాలు పరిష్కారమవుతాయి.
ఆరోగ్యపరంగా కొంత చికాకులు తప్పవు.
వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు పొందుతారు.
ఉద్యోగ విధి నిర్వహణ ప్రశాంతంగా సాగిపోతుంది.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు తగిన ప్రోత్సాహం అందుతుంది.
శ్రీవారాహీ స్తోత్రం పఠించండి.