ధనుస్సు
అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
సమాజంలో గౌరవం పెరుగుతుంది.
ఆశ్చర్యకరమైన రీతిలో రాబడి పెరుగుతుంది.
శుభకార్యాల నిర్వహణపై నిర్ణయాలు తీసుకుంటారు.
కొత్త కాంట్రాక్టుల యత్నాలు సఫలమవుతాయి.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుటుంబ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేసే వీలుంది.
వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
కొత్త పెట్టుబడులు సమకూరతాయి.
ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి సహకారం అందుతుంది.
కొన్ని సమస్యలు తీరతాయి.
రాజకీయవర్గాలు, కళాకారులు కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు.
వారారంభంలో శ్రమ పెరుగుతుంది.
దుబారా వ్యయం. ఆకస్మిక ప్రయాణాలు.