వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
శుభ అశుభ ఫలితాల మిశ్రమం గా ఉంటుంది.
కొన్ని సందర్భాలలో సమస్యలు ఎదురైనప్పటికీ అలాగే పనులలో అవాంతరాలు ఎదురైనా ఎదురుకొని నిలబడగలుగుతారు.
ముఖ్యం గా ఆర్థికపరంగా ఒడిదుడుకులు ఎదురుకోవలసి వస్తుంది. ఈ విషయం గమనించుకొని తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ఖర్చులు నియంత్రణ లో ఉంచుకొని ఆచి తూచి ఆలోచించి అడుగు ముందుకు వేయడం మంచిది
ముఖ్యం గా షేర్లు స్పెక్కులేషన్స్ కి దూరంగా ఉండాలి
చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా పెద్దగా బాధించవు
మార్చ్ తర్వాత నుండి కొద్దిగా సమస్యల నుండి బయటపడగలిగే మార్గాలు కనబడతాయి
భవిష్యత్తు గురించి ఆలోచనలు అధికమవుతాయి.
వీరు పాటించాల్సిన సూచన ఏమిటంటే
ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి ముఖ్యం గా దూరప్రయాణాలు
కోపాన్ని నియంత్రించుకొని, శాంతం గా ఉండే ప్రయత్నాలు చేయాలి