కన్య...
------
కొత్త విషయాలు తెలుసుకుని ఆశ్చర్యపడతారు.
మీ ఆలోచనలు అమలు చేసి ముందడుగు వేస్తారు.
ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది.
కొన్ని సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు.
గృహ నిర్మాణ ప్రయత్నాలలో అడుగు ముందుకు వేస్తారు.
చీటికీమాటికీ వేధిస్తున్న సమస్యలు తీరతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.
రావలసిన సొమ్ము అందుతుంది. రుణభారాలు తొలగుతాయి.
కుటుంబసభ్యుల ఆదరణ పెరుగుతుంది.
ఆరోగ్యపరమైన చికాకులు తొలగుతాయి.
వ్యాపారాలలో క్రమేపీ పుంజుకుని లాభాలు గడిస్తారు.
ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు.
రాజకీయవేత్తలు, పరిశోధకులకు విశేష కీర్తి దక్కుతుంది.
శ్రీ ఆంజనేయ దండకం పఠించండి.