Yearly moonsign Horoscope

Aquarius

2023-03-21 to 2024-04-08

 

కుంభం

వీరికి ఆదాయం–11 , వ్యయం–5, రాజపూజ్యం–2 , అవమానం–6గా ఉంటుంది.

గురు సంచారం అంత కలసి రాదు. జన్మరాశిలో శని సంచారంతో ఏల్నాటి శని ప్రభావం కలిగినా కుంభరాశి కావడం వల్ల మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ఇక రాహువు అక్టోబర్‌వరకూ శుభత్వం ఇస్తాడు.

మొత్తానికి వీరు కొన్ని సవాళ్లు ఎదుర్కొవలసి ఉంటుంది.

కుటుంబంలో మీ మాటను కాదనలేకపోయినా వారిలో అసంతృప్తి కనిపిస్తుంది.

వివాదాలకు మరింత దూరంగా ఉండడం మంచిది.

ఆర్థికంగా కొంత నియంత్రణ, ఖర్చులు అదుపు చేసుకోవడం మంచిది.

ఎక్కువ శ్రమ పడితే కొంత ఫలితం కనిపిస్తుంటుంది.

శని సంచారం ఈ ఏడాది అనుకూలం.

ఆచితూచి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి.

జూన్‌, నవంబర్‌ మధ్య మాత్రం శని తీవ్ర ప్రభావం చూపవచ్చు.

ముఖ్యంగా ఈకాలంలో ధనిష్ఠ, శతభిషం నక్షత్రాల వారు మరింత అప్రమత్తంగా మెలగాలి.

వాహనాలు విషయంలో తొందరపాటు అసలు వద్దు.

రాహుకేతువులు ప్రథమార్థంలో శుభదాయమైన ఫలితాలు ఇస్తారు.

నిరుద్యోగులు తమ అన్వేషణ తీవ్రతరం చేసి ఎట్టకేలకు విజయం సాధిస్తారు.

స్థిరాస్తులు కొనుగోలులో మొదట్లో కొన్ని అవాంతరాలు ఎదురైనా చివరికి మీకే సొంతం కాగలవు.

వ్యాపార, వాణిజ్యవేత్తలు కృషికి తగిన లాభాలు పొందుతారు. ఇనుము, ఐరన్, బంగారం వ్యాపారులకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది.

ఉద్యోగస్తులు బాధ్యతలు పెరిగి కొంత విరక్తి చెందే అవకాశాలున్నాయి. అయితే పట్టుదల, ఆత్మవిశ్వాసం పెంచుకుని సాగితే విజయాలు సిద్ధిస్తాయి.

పారిశ్రామికవేత్తలు, శాస్త్రవేత్తల శ్రమ ఇతరులకు ఉపయోగపడుతుంది.

రాజకీయవేత్తలపై ఒత్తిడులు పెరుగుతాయి. వీరికి కొన్ని పదవులు సైతం చేజారవచ్చు.

కళాకారులకు ద్వితీయార్థంలో అనుకూలిస్తుంది.

వ్యవసాయదారులు మనోనిబ్బరంతో నష్టాలు అధిగమిస్తారు.

విద్యార్థులకు శ్రమ మరింత పెరుగుతుంది.

ఆరోగ్యం పై నిర్లక్ష్యం వీడి ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలి.

చైత్రం, జ్యేష్ఠం, కార్తీకం, మార్గశిర మాసాలు అనుకూలించగా, మిగతావి సామాన్యఫలితాలు ఉంటాయి.

వీరు శనీశ్వరునికి తైలాభిషేకాలు, గురునికి జపాలు, రాహుకేతువులకు పరిహారాలు చేయడం మంచిది.

సుబ్రహ్మణ్యారాధన శుభకరం.

 

To know more about Sunsigns and MoonSigns, Click here

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download