Yearly moonsign Horoscope

Libra

2020-03-25 to 2021-04-12

తుల

రాశి వారికి ఆదాయం–14, వ్యయం–11, రాజపూజ్యం–7, అవమానం–7గా ఉంటుంది.

వీరికి మూర్తిమంతం చేత జూలై నుంచి నవంబర్‌వరకూ గురుడు శుభఫలితాలు ఇస్తాడు. మిగతా కాలమంతా సామాన్య ఫలితాలు ఇస్తాడు. అలాగే, అర్ధాష్టమ శని పాపి అయినందున వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ఇక సెప్టెంబర్‌ 23 నుంచి అష్టమ రాహువు కూడా పాపఫలితాలే అధికంగా ఇస్తాడు. మొత్తం మీద వీరికి సంవత్సరమంతా సామాన్య ఫలితాలే ఉంటాయి.

వీరికి కార్యక్రమం చేపట్టినా అవాంతరాలు, చికాకుల మధ్య ఎట్టకేలకు పూర్తి కాగలవు.

ఆదాయం ఉన్నా ఖర్చులు కూడా మీదపడుతూ ఒడిదుడుకులుగా కొనసాగుతుంది.

కుటుంబ సభ్యులే మీకు ఎదురుతిరిగే సందర్భాలు ఎదురవుతాయి.

ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ చూపడం మంచిది. తరచూ వైద్య సేవలు పొందుతారు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.

అలాగే, ప్రయాణాల్లోనూ కొంత అప్రమత్తత పాటించాలి.

బంధువర్గంతోనూ వివాదాలు, సమస్యలు ఎదురవుతాయి.

తీర్థ యాత్రలు విరివిగా చేస్తారు.

ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు ఎదురై కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు, తరచూ నిర్ణయాలు మార్చుకుంటారు.

భార్యాభర్తల మధ్య కూడా కొన్ని అపోహలు, అపార్ధాలు నెలకొంటాయి.

విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు కొంత కష్టపడాలి.

నిరుద్యోగులు ఎట్టకేలకు ఉపాధి అవకాశాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు మరింత ఆలస్యమవుతాయి, ఆశించిన లాభాలు కష్టమే. విస్తరణ కార్యక్రమాలలోనూ ఆచితూచి వ్యవహరించాలి.

ఉద్యోగస్తులకు అదనపు  బాధ్యతలు మీదపడి సహనాన్ని పరీక్షిస్తాయి. అలాగే, ఊహించని మార్పులు తథ్యం. పైస్థాయి అధికారులతోనూ విభేదిస్తారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సామాన్యంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం మంచిది.

కళాకారులు ద్వితీయార్థంలో కొంత అనుకూలమైన ఫలితాలు పొందుతారు.

రాజకీయవేత్తలు ఉన్న పదవులు కాపాడుకుంటూ సహనంతో మెలగడం ఉత్తమం.

వ్యవసాయదారులకు రెండవ పంట కాస్త లాభిస్తుంది.

క్రీడాకారులు, వైద్యులకు పరీక్షా సమయమని చెప్పాలి. అయితే ఏడాది చివరి భాగం కొంత అనుకూలత ఉంటుంది.

వీరు గురు, శని, రాహువులకు పరిహారాలు చేయించుకుంటే మంచిది. అలాగే, దుర్గాదేవి, హనుమాన్‌ పూజలు చేస్తే ఉపశమనం లభిస్తుంది.

చైత్రం, జ్యేష్ఠం, శ్రావణం, మాఘ మాసాలు అనుకూలమైనవి కాగా, మిగతావి సామాన్యంగా ఉంటాయి.

అదృష్టసంఖ్య 6

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download