Yearly moonsign Horoscope

Scorpio

2020-03-25 to 2021-04-12

వృశ్చికం

వీరికి ఆదాయం 5, వ్యయం–5, రాజపూజ్యం–3, అవమానం–3 గానూ ఉంటుంది.

ఇక వీరికి సెప్టెంబర్‌ 23 వరకు అష్టమ రాహు దోషం ఇబ్బంది కలిగించినా గురు, శనులు అనుకూల ఫలితాలు ఇస్తారు. మొత్తం మీద వీరికి శుభ ఫలితాలే అధికంగా ఉంటాయి.

అష్టమ రాహు దోషం కారణంగా వీరికి తరచూ ఆరోగ్య సమస్యలు, వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి.

ఇక ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. రుణ బాధలు క్రమేపీ తగ్గుతాయి.

కార్యక్రమమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. శ్రమపడ్డా ఫలితం కనిపిస్తుంది.

ప్రతి వ్యవహారంలోనూ యుక్తిగా మసలుకొని విజయం సాధిస్తారు.

తరచూ తీర్థ యాత్రలు సాగిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. జ్ఞాతుల నుంచి ఆస్తి లాభాలు కలుగుతాయి.

మీ పై బంధువుల ఆదరణ మరింత పెరుగుతుంది.

ఎటువంటి పరిస్థితులనైనా చాకచక్యంగా అనుకూలంగా మార్చుకుంటారు.

సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కోర్టు వ్యవహారాలలో సైతం విజయం సాధిస్తారు.

విద్యార్థులు విదేశీ విద్య, ఉద్యోగావకాశాలు సాధిస్తారు.

నిరుద్యోగులకు యత్నాలు సఫలమై ఉద్యోగాలు సాధిస్తారు.

వ్యాపారస్తులకు పెట్టుబడులు సమకూరతాయి. భాగస్వాములతో వివాదాలు సమసిపోతాయి. విస్తరణ కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ముఖ్యంగా ఆయిల్, ఇనుము వ్యాపారాలు విశేషంగా లాభిస్తాయి.

ఉద్యోగస్తులకు హోదాలు పెరిగి కీర్తి దక్కుతుంది. చేసే పనిలో సమర్థతను చాటుకుంటారు.

పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది.

కళాకారులకు అవకాశాలు మరిన్ని దక్కి ఉత్సాహంగా గడుపుతారు. అలాగే, ఊహించని అవార్డులు కైవసం చేసుకుంటారు.

రాజకీయవేత్తలకు పదవీయోగం, తద్వారా మంచి గుర్తింపు లభిస్తుంది.

వ్యవసాయదారులకు రెండు పంటలూ అనుకూలిస్తాయి.

క్రీడాకారులు, టెక్నికల్‌ రంగాలకు చెందిన వారు గతేడాది కంటే మించి విజయాలు సాధిస్తారు.

వీరు నవంబర్‌ 20 తరువాత గురునికి పరిహారాలు చేయించుకుంటే ఉత్తమం. అలాగే, శివ, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

చైత్రం, వైశాఖం, ఆషాఢంశ్రావణంఆశ్వయుజం, ఫాల్గుణ మాసాలు విశేషంగా కలిసి వస్తాయి. మిగతావి మధ్యస్థంగా ఉంటాయి.

అదృష్ట సంఖ్య–9.

1. మేష రాశి –(అశ్వని, భరణి, కృత్తిక 1 వ పాదం)
2. వృషభ రాశి –(కృత్తిక 2,3,4పాదాలు, రోహిణి , మృగశిర 1,2పాదాలు)
3. మిథున రాశి- (మృగశిర 3,4పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1,2,3పాదాలు)
4. కర్కాటక రాశి –(పునర్వసు4వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
5. సింహ రాశి –(మఖ, పుబ్బ, ఉత్తర 1వపాదం)
6. కన్య రాశి –(ఉత్తర 2,3,4పాదాలు, హస్త, చిత్త 1,2పాదాలు)
7. తుల రాశి –(చిత్త 3,4పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు)
8. వృశ్చిక రాశి –(విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ)
9. ధను రాశి –(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం)
10. మకర రాశి- (ఉత్తరాషాఢ 2,3,4పాదాలు, శ్రవణ, ధనిష్ఠ 1,2పాదాలు)
11. కుంభ రాశి –(ధనిష్ఠ 3,4పాదాలు, శతభిష, పూర్వాభాద్ర 1,2,3పాదాలు)
12. మీన రాశి- (పూర్వాభాద్ర 4వ పాదం , ఉత్తరాభాద్ర, రేవతి)

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download