దక్షిణాయనం
సూర్యుడు ప్రతి నెలలోనూ ఒక రాశి నుండి మరొక రాశిలోకి ప్రవేశిస్తుంటాడు దీనినే సంక్రమణం అంటారు. కర్కాటకం లోనికి సూర్యుడు ప్రవేశించడం తోనే దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సుర్యుడీ రాశి లో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకరరాశి లోకి ప్రవేశించేంత వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అంటారు. ఆయనం అంటే ప్రయాణం అని అర్ధం. దక్షిణాయనం అంటే దక్షిణ దిశగా ప్రయాణం చేయడమనే అర్ధం వస్తుంది. ఈ ఆయనం లో సూర్యుడు భూ మధ్య రేఖకు దక్షిణం గా సంచరిస్తాడు. దేవతలకు ఉత్తరాయణం పగలు గా, దక్షిణాయనం రాత్రి గా చెప్పబడింది. దక్షిణాయనం పితృదేవతల కి ప్రీతికరమైనది. సంక్రమణం ప్రవేశించిన మొదటి 6 గంటల 49 నిమిషాలు అత్యంత పుణ్య కాలం గా శాస్త్రాల ద్వారా తెలుస్తున్నది. ఈ సమయం లో ఆచరించే స్నాన, దాన జపాదులు అధిక ఫలితాలనిస్తాయి.
శ్రీ మహావిష్ణువు దక్షిణాయనం లో నిద్రకు ఉపక్రమించి ఉత్తరాయణ పుణ్యకాలం లో మేల్కొంటాడు. దక్షిణాయనం పితృ దేవతలకి ప్రీతికరమైనది. కర్కాట సంక్రాంతి నుండి మకర సంక్రాంతి మధ్య కాలం దక్షిణాయనం. ఈ సమయం లో వైజ్ఞానికపరంగా విశ్లేషించుకొంటే సూర్య కిరణాలు తీవ్రం గా ఉండవు, అలాగే ఈ సమయం లో శరీరం లో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ పని తీరు కూడా తగ్గుతుంది. అందుకే పండగలు, ఉపవాసాలు, దీక్షలన్నీ, కూడా దక్షిణాయనం లో అధికం గా ఉంటాయి. తద్వారా వాటిని ఆచరించడం వలన శారీరిక ఉపశమనం పొందగలం.
ఈ సమయం లో విష్ణు సహస్రనామ పారాయణ, ఆదిత్యహృదయ పారాయణం, సూర్యుణ్ణి పూజించడం, పితృ తర్పణాలు ఆచరించడం, సాత్విక ఆహరం తీసుకోవడం ముఖ్యం గా అన్న దానం, వస్త్ర దానం, నెయ్యి, గోదానం అత్యంత పుణ్య ప్రదం గా చెప్పబడింది.
Enhance your trading decisions with clear insights from Visit finprofmreviews.com and explore thorough evaluations that reveal every detail; transparency and depth make the difference.