చాతుర్మాస్య దీక్ష లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం 

చాతుర్మాస్య దీక్ష లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం 

చాతుర్మాస్య దీక్ష లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం 

మానవ జీవితాన్ని క్రమబద్దికరించేది చాతుర్మాస్యవ్రతం. ఆషాడం నుండి కార్తిక మాసం వరకు ప్రకృతి లో అనేక రకాల మార్పులు వస్తాయి కాలం లో  బావుల్లో, నదుల్లోకి కొత్త నీరు చేరి తాగితే ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి ఋతువులో ఆషాడం నుండి నాలుగు నెలలు పాటు ఆచరించవలసిన ఆరోగ్యప్రద వ్రతాన్ని చాతుర్మాస్యము అంటారు. ప్రతి సంవత్సరం ఆషాడ శుక్ల ఏకాదశినాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించి మరుసటిరోజు చాతుర్మాస్య వ్రతానికి సంకల్పం చేసి దాన్ని ఆరంభిస్తారు. కార్తిక శుక్ల ఏకాదశి రోజున ఏకాదశి ని పాటించి మరుసటి రోజు (ద్వాదశి) చాత్రుమాస్య వ్రతాన్ని పూర్తి చేస్తారు

వర్షఋతువు ప్రారంభమయ్యే కాలం ఎక్కువ ఉష్ణమగును,కావున ఉష్ణము చేయు ఆహారమును వర్జించమన్నారు మన పెద్దలు. దీనినే శాక వ్రతం అన్నారు. ఆషాడ మాసం లో కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువగా పండుతాయి. ఇవి భూమి లో ఉండే ఉష్ణ సహాయముతో పెరుగుతాయి. శిశిర, వసంత, గ్రీష్మ ఋతువులందు భూమి లో ఉండే వేడి ఎక్కువ గా కేంద్రీకరించి ఉంటుంది. వర్షాకాలం ప్రారంభమప్పుడు , భూమి కి నీరు చేరి, లోపలి అత్యుష్ణము సస్యముల మూలకం గా విసర్జింపబడుతుంది. సస్యముల నుండి లభించే కూరగాయలు, ఆకు కూరలు నెలలో తినడం వలన శరీరం లో ఉన్న వేడి, తక్కువ అవడానికి అవకాశం లభించదు. మనము తినే ఆహారం మూలకంగానే అనేక రోగాలు వస్తాయి. ఆహార నియామాలని ఉల్లంఘిస్తే అనేక విధములైన రోగాలు కాల క్రమేణా దాపరిస్తాయి. అందుచే కాలం లో భూమి నుండి బహిర్గతమవు వేడి శాక పత్రములందు ఎక్కువ గా ఉండుటవలన, కాలం లో వాటిని సేవించ కూడదని మన పెద్దలు చెప్పారు. మరి మనుష్యుని కి కావలసిన కొద్దిపాటి వేడి ఇతర ఆహార పదార్దములనందున్నదే, కాలానికి చాలునన్నారు

 

ఆషాడ శుద్ద ఏకాదశి మొదలుకొని కార్తిక శుద్ద ఏకాదశి వరకు విధమైన కాయగూరలు, ఆకు కూరలు భోజన పదార్ధములుగా వాడరాదు. పదార్ధములు తిన్నా పప్పు పదార్దములతో వండినవే అయ్యి ఉండాలి. చివరకు పోపు సామాన్లలో వాడే కరివేపాకు, కొత్తిమీర కూడా వాడరు. అంతేకాదు కారము కొరకు మిరియాలు, జీలకర్ర తప్ప తక్కిన సుగంధ ద్రవ్యాలను వాడరు వ్రత కాలం లో ఉసిరిక వరుగు, మామిడి వరుగు, వేప పూత (ఎండిన పువ్వులు) పచ్చళ్ళుగా వాడుకోవాలి. నిమ్మకాయ, గుమ్మడి కాయ, ముల్లంగి, రేగుపళ్ళు, పొట్లకాయ, చెరుకు, చింతపండు, మినుములు, ఉలవలు తెల్లఆవాలుఅలచందలతో చేసిన పదార్ధాలను తినకూడదు విధమైన ఆహార నియమం మనస్సును స్థిరపరచడానికి దైవధ్యానానికి, ఆరోగ్యానికి తోడ్పడతాయి

 

 

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download