అధిక మాసం లో ఆచరించవలసిన విధులు

అధిక మాసం లో ఆచరించవలసిన విధులు

 

 

అధిక మాసం లో ఆచరించవలసిన విధులు

 

సూర్యుడు నెలకు ఒక రాశి చొప్పున సంవత్సరానికి 12 రాశుల్లో సంచరిస్తాడు. అయితే ఒక రాశి నుండి వేరొక రాశి కి సూర్యుడు ప్రవేశించడాన్ని సంక్రమణ మని అంటారు. సూర్యుని సంక్రమణం జరగని శుద్ద పాడ్యమి నుండి అమావాస్య వరకు గల నెల రోజులను "అధిక మాసమని" అంటారు.

ప్రతిసారి వచ్చిన అధిక మాసం మొదలుకొని 30 మాసాలకు పైన  తిరిగి అధిక మాసం వస్తుందని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. ఈ మాసం లో ప్రత్యేకమైన ఫలాన్ని ఆశించి చేసే విధులు నిషిద్దం. నిత్య కర్మలు యధావిధిగా ఆచరించవచ్చు. ఈ మాసం లో పరమాత్ముడైన పురుషోత్తముడిని ప్రతి రోజు విధిగా అర్చించి పూజించడం వలన మంచి ఫలితాలు కలుగుతాయి. పురాణ ప్రవచనాలు వినడం, జరిపించడం ప్రత్యేకించి భవద్గీత పారాయణ చేయడం, దేవాలయాలని  పుణ్య తీర్ధాలని దర్శించడం మంచిది. ఈ సమయం లో శ్రీ మహావిష్ణువు ని తులసి దళాలతో పూజించి, అభిషేకాది పుణ్య కార్యాలు నిర్వహించడం విశేష ఫలితాన్నిస్తుంది.

శక్తి కొలది దాన ధర్మాలు, ఆరోగ్యం సహకరిస్తే ఒంటి పూట భోజనం చేయడం , విస్తరాకులో భుజించడం, ముఖ్యం గా సాత్విక ఆహారం తీసుకోవడం,  నేల పై నిద్రించడం, సూర్యోదయానికి ముందే లేచి, స్నానాది కార్యక్రమాల అనంతరం నిత్య కర్మలు, భగవన్నామస్మరణ చేయడం, అధికమాస వ్రతమాచరించడం, బ్రాహ్మణులని  సత్కరించడం  పుణ్యదాయకం.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download