నాగుల చవితి విశిష్ఠత

నాగుల చవితి విశిష్ఠత

 

నాగుల చవితి విశిష్ఠత

ప్రకృతి  లో ఎన్నో రకాల జీవుల వలన ఎన్నో రకాల మేలు జరుగుతుంటుంది. వాటిలో పాములు కూడా ఒకటి గా చెప్పవచ్చు విష జంతువులని అదే పని గా వాటిని చంపివేయడం మంచిది కాదు. దీని వలన జీవ సమతుల్యం దెబ్బతింటుంది. అందుకే పెద్దలు అహింసామార్గాన్ని , పరోపకారాన్ని తెలియ చెప్పే విధం గా ఎన్నో ఆచారాలు, పండుగలు , నియమాలు ఏర్పరచారు, వాటిలో ప్రత్యేకం గా నాగులను పూజించడానికి కూడా ప్రత్యేకమైన రోజులు ఏర్పరచారు.  

 నాగుల చవితి నాడు ప్రత్యేకం గా పుట్ట కి పూజ చేయడం అనాది గా వస్తున్న ఆచారం. నిజానికి పుట్టలో పోసే పాలు, గుడ్లు పాములు తాగలేవు, తినలేవు. పుట్టలో చల్ల దనాన్ని కొనసాగించడానికి పాలు పోస్తారు. చిమ్మిలి, చలిమిడి పుట్ట వద్ద ఉంచడం వల్ల  ఆహారం కోసం కప్పలు ఎలుకలు పుట్టలోకి వెళతాయి, పాము కి ఆహారమైన ఇటువంటి ప్రాణుల వలన పాముకు ఉన్న చోటనే ఆహరం లభిస్తుంది. దాని వలన పాములు కూడా వాటి స్థావరాన్ని వదిలి తొందరగా బయటకు రావని, వాటి వలన జరిగే హాని ని నివారించవచ్చని పెద్దల ఆలోచన.  ఆ రోజున భూమిని దున్నడం, తరిగిన కూరలు తినడం నిషిద్ధం. ముఖ్యం గా కార్తీక మాసం లో సూర్యుడు కామానికి, మృత్యువుకూ  స్థానమైన వృశ్చిక రాశి  లో సంచరిస్తాడు. ఆ సమయం లో నాగారాధన చేయడవం వల్ల కామాన్ని మృత్యువును జయించే సిద్ది కలుగుతుంది. sexdates

పాము పుట్టనితొవ్వడం, చెదరగొట్టడం అనర్ధదాయకం గా చెప్తారు. నాగులను పూజించడం వలన చర్మ రోగాలు, కళ్ళ కి  మరియు చెవులకి సంబంధించిన సమస్యలు తగ్గుతాయని ప్రతీతి. పాము  విషం నుండి మరియు కుబుసం నుండి కొన్ని రకాల మందులను తయారు చేస్తారు. పుట్ట మీద వస్త్రాలను పెట్టి తీసి వాటి ని ధరిస్తారు. దీని వలన కోరికలు సిద్ధిస్తాయని నమ్మకం. సంతానం లేని వారు, రావి చెట్టు మొదట్లో నాగులను ప్రతిష్టించి పూజిస్తారు. పాములు లైంగిక పటుత్వానికి, బహు సంతానానికి ప్రతీక. రావి చెట్టు తిరిగి ప్రక్షిణలు చేయడం వలన పూజ కొరకు రావి చెట్టు కింద సమయం గడపడం వలన గర్భసంబంధమైన దోషాలు తొలగి, శరీరానికి తగు వ్యాయామం జరిగి సంతానం కలగడానికి గల మార్గాలు సులభతరమవుతాయి.

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download