మకర రాశి లో గురుగ్రహ సంచార ప్రభావం ద్వాదశ రాశుల వారి పై ఎలా ఉంటుంది

మకర రాశి లో గురుగ్రహ సంచార ప్రభావం ద్వాదశ రాశుల వారి పై ఎలా ఉంటుంది

మకర రాశి లో గురు గ్రహ సంచార ప్రభావం వలన ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు మరియు పరిహారాలు

 

గత ఏడాది కాలంగా స్వక్షేత్రమైన ధనుస్సు రాశిలో సంచరించిన గురువు ఈనెల (నవంబర్‌) 20, 2020 వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1.21గంటలకు నీచ స్థానమైన మకర రాశిలోకి ప్రవేశించి ఏడాదిపాటు శనితో కలిసి సంచరిస్తాడు. ఈ రోజు నుండి (20-11-2020)  తుంగభద్ర నది పుష్కరాలు ప్రారంభం.

 

మేషం

వృత్తి లో ఎదుగుదల కోసం కొత్త ప్రయత్నాలు కొత్త పరిచయాలు అనుకూల ఫలితాలనిస్తాయి.

గట్టి పోటీ ఎదురుకోవలసిన సమయం.

అయితే చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ మీద ధ్యాస పెట్టడం  మంచిది. రెండు మూడు ప్రాజెక్ట్స్ఒకేసారి మీద వేసుకొని రెండు పడవల మీద ప్రయాణం ఏ మాత్రం మంచిది కాదు.

ఒక దాని తర్వాత ఒకటి ప్లాన్  చేసుకోవడం మంచిది.

ఆర్ధిక రాబడి  ఉన్నప్పటికీ సరైన దిశా నిర్దేశం  లేకపోతే పొదుపు చేయడం లో వెనకబడతారు.

చిన్న చిన్న చిన్న చిన్న అనారోగ్య వస్తాయి ముఖ్యం గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వంటివి కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

వ్యక్తిగత జీవితం లో సమస్యల్ని సున్నితం గా పరిష్కరించుకోవాలి. వ్యక్తిగత జీవితం లో ఒత్తిడి కి లోనవుతే ఆ ప్రభావం ఇతర విషయాల పై పడుతుందని గ్రహించాలి.

పరిహారాలు

మీరు గురువుగా భావించే వారి ని మీ శక్తానుసారం పూజించాలి.

బ్రాహ్మణులకి భోజనం, వస్త్రాలు సమర్పించాలి.

పూజ గదిలో పసుపు వస్త్రం ఉంచి ధూప దీపాలతో పూజించాలి

 

 

 

వృషభం

వృత్తిరీత్యా మరియు వ్యాపార పరం గా పనులు ఆలస్యమైనప్పటికీ ఓర్పు వహిస్తే ఖచ్చితం గా విజయాలు అందుకొంటారు. పెట్టుబడులకు దూరం గా ఉండాలి .

కొత్త ప్రాజెక్ట్స్  తీసుకొని వెంటనే ఫలితాల కోసం ఎదురుచూడకుండా శ్రమిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

మీ పనితనాన్ని నలుగురు ప్రశంసించే విధం గా మీ చర్యలు ఉంటాయి.

ఆరోగ్యపరంగా చిన్న విషయమే కదా అని అశ్రద్ధ చేస్తే మటుకు సమస్యలు వస్తాయి, వెంటనే పరిష్కారం వెతుక్కొంటే అసలు సమస్య అనిపించదు.

వ్యక్తిగత జీవితం ఆహ్లాదం గా గడుస్తుంది, కుటుంబ సభ్యులతో చిన్న చిన్న చికాకులు కోపతాపాలు తలెత్తుతుంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త పనులు చేయడం మంచిది పరిహారాలు

ఒక గిన్నె లో నీరు పోసి గంగా జలం కలపాలి అందులో ఒక రూపాయ బిళ్ళ వేసి భగవంతుని ముందు ఉంచి పూజించి ఎవరు తొక్కని ప్రదేశం లో పారబోయాలి.

ఒక విద్యార్థి చదువు కు ఆర్ధిక సహాయం అందించాలి.

 

మిథునం

వృత్తిరీత్యా మీ స్థాయి మీరు కాపాడుకోవడానికి మరింత శ్రమించవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు వారియొక్క కస్టమర్లను  పెంచుకొనే విషయం లో విజయం సాధిస్తారు.

భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకొని పొదుపు చర్యలను ని ప్లాన్  చేసుకొంటే ఆకస్మికం గా ఎదురయ్యే ఖర్చులను సమర్థవంతంగా ఎదురుకోగలరు.

దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు తరచూ వైద్య సలహాలు తీసుకోవలసి వస్తుంది.

సంతానానికి సంబంధించి శుభవార్తలు.

వ్యక్తిగత విషయం లో తెలియని అసంతృప్తి బాధిస్తుంటుంది. ఇందులో నుండి బయటపడడానికి ఇతర వ్యాపకాల పై దృష్టి పెట్టడం వలన మానసిక అశాంతి కి దూరం గా ఉంటారు.

 

పరిహారాలు

వృద్దాశ్రమాల్లో   మందులు దానం   చేయడం.

అలాగే ఆర్ధికం గా వెనుకబడిన విద్యార్థులకు చదువుకోవడానికి అవసరమైన మెటీరియల్ అందించడం  చేయాలి

గురువారం రోజున ఒక టెంకాయ ని పసుపు రంగు వస్త్రం లో చుట్టి తీపి పదార్థాలతో సహా లక్ష్మి నారాయణ గుళ్ళో ఇవ్వాలి.

పెళ్ళైన ముత్తైదువులకు మంగళకరమైన వస్తువులు దానం చేయాలి.

 

కర్కాటకం

వ్యాపారస్తులకు అనుకొన్న సమయానికి అనుకొన్న పనులు జరిగే అవకాశాలు తక్కువ గా ఉన్నాయి. ఇది దృష్టి లో ఉంచుకొని వారు ప్లాన్ చేసుకోవలసి ఉంటుంది.

ఉద్యోగస్తులకు వారి యొక్క లక్ష్య సాధన కష్టతరమవుతుంది. (అంటే ఈ పని సాయంత్రం లోపల చేయాలి అనుకొంటారు కానీ ఎదో ఒక విషయం వలన ఆగి ఆ పని పూర్తి కాదు).

ఉద్యోగస్తులు  అనవసరమైన రాజకీయాలకి దూరంగా ఉండాలి.

మీరంటే పడని వారు మీ వెనుక సమస్యలు సృష్టించే అవకాశం కలదు కావున ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు.

ఆర్ధికం గా ఎక్కువ అభివృద్ధి లేనప్పటికీ చిన్న చిన్న ఒడి దుడుకులని సమర్దవంతం గా ఎదురుకోగలరు.

ఉదర సంబంధిత మరియు చర్మ సంబంధిత సమస్యలు కొంత బాధించవచ్చు. ముఖ్యం గా ఆహారపు అలవాట్ల వలన సమస్యలు ఎదురుకోవలసి వస్తుంది.

వ్యక్తిగత జీవితం లో తరచూ ఎదో ఒక చికాకులు ఎదురవుతాయి. దీనివలన మానసిక ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతాయి.

పరిహారాలు

ఒక గురువారం రోజున ఉప్పు లేని ఆహారం  తీసుకోవడం మంచిది

పసుపు రంగు తీపి పదార్థాలు మరియు విద్యార్థులకు పుస్తకాలు అందించాలి.

ముఖ్యం గా పని చేసుకొంటూ చదువుకొనే విద్యార్థులకు సహాయం చేయడం మంచిది

 

సింహం

నూతన అవకాశాల వలన  స్థాయి తో పాటు ఆర్ధికం గా కూడా అభివృద్ధి

ఉంటుంది.

ఉన్నతాధికారుల నుండి మంచి ప్రోత్సాహం లభించటం తో మరింత ఉత్సాహం గా ముందుకు వెళ్తారు.

వ్యాపారస్తులు గట్టి పోటీ ని ఎదురుకోవలసి వస్తుంది, దీని వలన కొంత ఆందోళన చెందుతుంటారు.

ఆర్ధికం గా నిలదొక్కుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

దైవ సంబంధిత కార్యక్రమాల కొరకు డబ్బు ఖర్చు చేస్తారు.

జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది, ఆహారపు అలవాట్లు అదుపు చేసుకొని కొంత జీవన శైలి లో మార్పులు చేసుకొంటే దీని నుండి సులభం గా బయటపడవచ్చు.

వ్యక్తి గత జీవితం లో చికాకులు  ఎదురైనప్పటికీ వాటిని పెద్దవి చెయ్యకుండా సామరస్యం గా పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అనవస్త్రమైన controversies కి దూరం గా ఉండడం మంచిది.

 

పరిహారాలు

గురువుగా భావించే వారిని పూజించాలి మీ శాక్తానుసారం కానుకలు ఇవ్వవచ్చు (నూతన వస్త్రాలు, వాడుకొనే వస్తువులు)

గురువారం రోజున సజ్జ మరియు శెనగ పిండితో కలిపి చేసిన రొట్టెలని ఆవుకి ఆహారం గా ఇవ్వాలి.

ఇంటి ప్రధాన ద్వారం మీద స్వస్తిక్ చిహ్నాలు వేసి ప్రతి రోజు ధూపం వేయాలి.

 

కన్య - వ్యాపారరీత్యా ఉద్యోగరీత్యా మంచి అవకాశాలు వస్తాయి, (వేరే ప్రాజెక్ట్స్ కి మార్చడం లేదా బదిలీ కావడం వంటివి) వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకొంటే భవిష్యత్తు లో మంచి అభివృద్ధి ఉంటుంది.

ఆర్ధికం గా మంచి అభివృద్ధి ఉంటుంది . పొదుపు ఎలా చేయాలి అనే దాని పై దృష్టి సారిస్తారు. స్థిరచరాస్తులు కొనడానికి అనుకూల సమయం.

వాతావరణ మార్పుల వలన వచ్చే చిన్న సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఏమి తలెత్తవు.

వ్యక్తిగత జీవితం చాలా ఉల్లాసం గా ఉంటుంది. కావలసిన వారి తో చక్కటి సఖ్యత సంబంధబాంధవ్యాలు ఏర్పడతాయి.

పరిహారాలు

11 గురువారాలు శివాలయం లోకుంకుమ పువ్వు కలిపిన పాలతో అభిషేకం చేయాలి. పసుపు రంగు పూల మాల, పసుపు రంగు పండ్లు, శెనగపిండి తో చేసిన తీపి పదార్థాలను స్వామి కి నివేదించాలి.  

నెమలి పించం పూజ మందిరం లో ఉంచడం మంచిది.

 

తుల

వ్యాపారస్తులకు పెద్ద అవకాశాలు దక్కే అవకాశం కలదు. ఉద్యోగస్తులు ఎప్పటికప్పుడు తమని తాము  అప్ డేట్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి.

ప్రయాణాలు చేయవలసి వస్తుంది. 

కొత్త పెట్టుబడులు పెట్టడానికి అవకాశం కలదు

స్థిరచరాస్తుల కొనుగోలు కూడా కలసి వస్తుంది.

ఎప్పటికప్పుడు ఆరోగ్య విషయం లో జాగ్రత్త వహిస్తుండాలి. అశ్రద్ద చేయకూడదు ముఖ్యం గా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు

వ్యక్తిగత జీవితం లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని సందర్భాలు బాధ కలిగించినా మరొక సందర్భం ఆనందాన్నిస్తుంది. ఈ విధం గా వ్యక్తిగత జీవితం సమతుల్యం గా నడుస్తుంటుంది.

పరిహారాలు

పౌర్ణమి రోజున వివాహమైన ముత్తైదువకు కి మంగళకరమైన వస్తువులు తాంబూలం ఇవ్వాలి, ముఖ్యం గా పసుపు  రంగు గాజులు, పసుపు రంగు చీర మొదలైనవి.

సోమవారం రోజున బ్రాహ్మణునికి భోజం పెట్టాలి.

చదువుకొనే వారికి సరైన వసతులు లేక పోతే వారు చదువుకోవడానికి కొంత స్థలం సమకూర్చడం మంచిది.

 

వృశ్చికం

వృత్తిరీత్యా ఎదగడానికి మంచి అవకాశాలు లభిస్తాయి

జాగ్రత్త గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వలన ఉత్తమ ఫలితాలు దక్కుతాయి, ముఖ్యం గా వ్యాపారస్తులు.

ఎందులో పెట్టుబడులు పెట్టినా లాభాలు ఉంటాయి. అనుకోని ఖర్చులు ఎదురైనా తట్టుకో గలిగే స్థోమత కలిగి ఉంటారు.

ఆరోగ్యరీత్యా అప్రమత్తం గా ఉండాలి , ముఖ్యం గా ప్రయాణాల వలన సమస్యలు వచ్చే అవకాశం కలదు చిన్న సమస్యైనా సరే  వైద్య సలహా తీసుకోవడం మంచిది.

ప్రత్యర్థులు సమస్యలు సృష్టించినా వాటి నుండి బయట పడగలుగుతారు.

వ్యక్తిగతం గా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కావలసిన వారితో సంతోషం గా సమయం గడుపుతారు.

పరిహారాలు

దేవాలయం, బడి, కాలేజి వంటి వాటికి మీ శాక్తానుసారం వాటికి సంబందించిన వస్తువులు కొనివ్వడం, లేదా వాటి ఉన్నతికి ఆర్ధిక సహాయం చేయడం.

7 గురువారాలు చందనం సువాసన కలిగిన అగరబత్తి లు, కుంకుమ పువ్వు కలిపిన పాలు, పసుపు కలిపిన అక్షింతలను ని లక్ష్మీ నారాయణ గుళ్ళో ఇవ్వడం మంచిది.

 శ్రీ సూక్త పారాయణ చేయడం లేదా వినడం మంచిది.

గురువారం రోజున తులసి మొక్క మొదట్లో పాలు పోసి  పూజించాలి.

చిన్న పిల్లలలకు కుంకుమ పువ్వు కలిపి చేసిన పాయసాన్ని ఇచ్చి దక్షిణ తో సహా తాంబూలం ఇవ్వాలి.

 

ధనుస్సు

ఉన్నత స్థితి కి చేరుకోవడానికి చక్కటి అవకాశాలు లభిస్తాయి, అయితే శ్రమించేతత్త్వం ఉంటేనే వచ్చిన అవకాశాలని సద్వినియోగపరచుకోగలరు.

ఎటువంటి గందరగోళం లేకుండా అవకాశాలని వినియోగించుకొని ముందుకు సాగితే మంచి వృద్ధి ఉంటుంది.

కుటుంబపరమైన ఖర్చులు పెరుగుతాయి. డబ్బు వస్తున్నప్పటికీ పొదుపు చేసుకొనే మార్గాలు అవలంబించాలి.

అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వైద్యుని సంప్రదిస్తే తొందరగా బయటపడతారు.

అవివాహితులకు వివాహ యోగం. సంతాన విషయం లో కూడా శుభ పరిణామాలు చోటు చేసుకొంటాయి.

వ్యక్తిగతం గా ఎంత ఓర్పు గా ఉంటే అంత ప్రశాంతత ఉంటుంది. అనవసరమైన వాగ్వివాదాలకు దూరం గా ఉండాలి.

పరిహారాలు

బీద విద్యార్థులకి పుస్తకాలు పంచడం, ఉచితం గా విద్య ని నేర్పించడం

పుస్తకాలు దానం చేయడం.

 గురువారం రోజున 5  పసుపు కొమ్ములను పూజించి లాకర్ లో పెట్టుకోవాలి.

 

 

మకరం

వృత్తి  లో ఎదగాలి అనుకోనప్పుడు అదనపు బాధ్యతలు స్వీకరించడానికి సన్నద్ధంగా  ఉండాలి.

వ్యాపారస్తులకు నూతన పరిచయాల వలన ఎదగడానికి అవకాశాలు లభిస్తాయి.

అనవసరమైన ఖర్చులని నియంత్రించడానికి ప్రయత్నించాలి, పొదుపు చేసే  మార్గాలని జాగ్రత్త గా choose చేసుకోవాలి.

వీలైనంత వరకు ప్రయాణాలు మానుకోవాలి.

చిన్న చిన్న సమస్యలే తప్ప పెద్దగా అనారోగ్య సమస్యలు ఉండవు.

మీకు సన్నిహితం గా ఉన్నవారి వలన మీ మనసు గాయపడే అవకాశం కలదు. చుట్టూ నలుగురు మనుష్యులు ఉన్నప్పుడు ఓర్పుతో ఉండాలి. ఏదైనా మనస్పర్థలు వస్తే ఓర్పుతో కూర్చొని చర్చించి పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి.

పరిహారాలు

గురువారం రోజున గురువు గా భవించే వ్యక్తి యొక్క ఆశీస్సులు తీసుకోవాలి.

7 గురువారాలు సోంపు, కుంకుమ పువ్వు, టెంకాయ పసుపు వస్త్రం లో కట్టి పసుపు రంగు స్వీట్స్ తో సహా శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయం లో ఇవ్వాలి.

అరటి చెట్టు నాటడం,అరటి పండ్లను దానం చేయడం మంచిది.

పశుపక్షాదులకు ఆహారం ఇవ్వడం.

రావి చెట్టు ను పూజించడం మంచిది.

 

కుంభం

వ్యాపార వ్యవహారాలు నిలకడగా ఉండడానికి అధికం గా శ్రమించవలసి ఉంటుంది. ముందు వెనుక ఆలోచించకుండా డబ్బు ఖర్చు పెట్టకూడదు.

అవకాశాలు మీ దగ్గరకి రావు వాటిని వెతుక్కొంటూ మీరే వెళ్ళాలి అని గుర్తుంచుకొని ప్లాన్ చేసుకోవాలి.

పోటీ పరీక్షలలో పాల్గొనే వారికి విజయాలశాతం ఎక్కువగా ఉంది.

నూతన పెట్టుబడులు పెట్టకూడదు. ఖర్చు పెట్టేటప్పుడు ఇది ఇప్పుడు అవసరమా కాదా అని ఆలోచించి డబ్బు ఖర్చు పెట్టాలి.

అనారోగ్య సమస్యల కి అవకాశం కలదు. జాగ్రత్త గా వ్యవహరించాలి.

వ్యక్తిగత జీవితం కొద్దిగా ఒత్తిడితో  గడుస్తుంది. కొద్దిగా ఓర్పు వహించి వాగ్వివాదాలకు దూరం గా ఉండాలి.

పరిహారాలు

కనీసం 5 గురువారాలు ఒక గిన్నె లో గంగాజలం తీసుకొని ఒక నాణెం వేసి ఎవరు తొక్కని ప్రదేశం లో ఈశాన్య స్థానం లో పారబోయాలి.

విద్యార్థుల చదువు కు ఉపయోగపడే వస్తువులు దానం చేయాలి.

 

మీనం

శ్రమ కి తగ్గ గుర్తింపు లభిస్తుంది. భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురిస్తాయి.

వ్యాపారస్తులకు మంచి అవకాశాలు లభిస్తాయి.

ఆర్ధికం గా ఊహించని లాభాలు దక్కించుకొంటారు.

ఎప్పటి నుండో అనుకొంటున్న కోరిక తీరే అవకాశం కలదు.

ప్రయాణాలు కలసి వస్తాయి/లాభదాయకంగా ఉంటాయి.

ఆరోగ్యపరం గా సమస్యలు తలెత్తుతాయి, కొంత ఇబ్బంది పడవలసి వస్తుంది. వైద్య సలహాలు పాటించడం మంచిది.

వ్యక్తిగతం గా కావలసిన వారి తో సఖ్యత తో మెలుగుతారు, ఏదైనా సమస్య వస్తే ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తే ప్రశాంతత ఉంటుంది లేకపోతె సమస్యలు తలెత్తుతాయి. 

పరిహారాలు

గురువారం రోజున బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి, అలాగే శాక్తానుసారం పసుపు రంగు వస్త్రాలు దానం చేయాలి.

రావి అరటి చెట్ల సంరక్షణ చూసుకోవడం , అంటే రోజు నీరు పోయడం వంటివి చేయడం మంచిది.

చదుకోవాలని ఆశ ఉండీ, చదువుకోలేకపోతున్న పిల్లలకు విద్యావకాశాలు కల్పించాలి.

 

 

 

 

Seksualus apatinis trikotažas moterims internetu Cherry24.lt

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download