కార్తీక మాసం లో ఆచరించే వన భోజనం యొక్క ప్రాధాన్యత
ఆధ్యాత్మికపరం గా శివ కేశవులకు ప్రీతికరమైన మాసం ఈ కార్తీకం. అనేక రకాల చెట్లు పచ్చ గా కంటికి ఆహ్లాదానిస్తూ స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన ప్రాణవాయువును ప్రకృతి లో ప్రసరింపజేస్తాయి. ఈ మాసం లో వన భోజనాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరికి సంతోషాన్ని కలిగించే గొప్ప కార్యక్రమం. హిందూ సంప్రదాయం లో అనాదిగా వస్తున్న/ఆచరిస్తున్న ఆచారాల ద్వారా ఆనందం, ఆధ్యాత్మికత మరియు ఆరోగ్యం యొక్క సందేశాలు ఉన్నాయి. కేవలం భక్తి ముక్తి కాకుండా సామాజిక భావనలను, సమైక్యతను, ప్రకృతి పట్ల అంకిత భావాన్ని తెలియజేసేవె ఈ ఆచారాలన్నీ కూడా.
పచ్చని చెట్లు ఆహ్లాదకరమైన వాతావరణం కుటుంబ సభ్యులు బంధు మిత్రులు అందరు కలసి వనభోజనాలు చేయడం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకొంది. ఈ మాసంలో ఏదో ఒక రోజు వన భోజనమునకు వెళ్ళవలెను. శివ కేశవులని, ఉసిరిక చెట్టును పూజించి వన భోజనమునకు వండిన పదార్ధాలను నైవేద్యముగా సమర్పించి, అనంతరం వన భోజనం చేయవలెను. పలు జాతుల వృక్షాలు వున్న వనములో ఉసిరిక చెట్టు క్రింద కూర్చుని భోజనం చేయాలనేది శాస్త్రవచనం ఉసిరికచెట్టు క్రింద కూర్చుని అరటి ఆకుల్లో కానీ, పనస ఆకుల్లో కానీ భుజిస్తే అశ్వమేధ యాగం చేసిన పుణ్యం కలుగుతుందని పురాణాల ఆధారం గా తెలుస్తుంది. ఆయుర్వేదం లో ఉసిరి చెట్టు కి విశేషమైన స్థానం ఉంది. ఉసిరి చెట్టు నుండి వచ్చే గాలి శరీరారోగ్యానికి ఎంతో ఉపకరిస్తుంది. ఉసిరి గాలిని పీల్చడం పైత్య ప్రకోపాన్ని ఉశమింపజేస్తుందని ఆయుర్వేదం చెబుతుంది. ఈ విధంగా కార్తిక వనభోజనాల వలన ఆధ్యాత్మిక సంపదతోపాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.
xxx hot movies