పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రం ఉండడం వలన ఈ మాసాన్ని కార్తీక మాసమంటారు. ఈ మాసం లో చేసే సమస్త పూజలు, జపాలు, దానాలు, తీర్థ యాత్రలు, ఉపవాస దీక్షలు మొదలైనవన్నీ కూడా అత్యంత పుణ్యఫలితాలనిస్తాయి. ప్రత్యేకించి దీపారాధన సర్వ శ్రేష్ఠమైన విధుల్లో ఒకటి. జ్ఞానికి దీపం సంకేతం. అజ్ఞాన అంధకారాన్ని పారద్రోలి వివేకరూపమైన జ్ఞానాన్ని ప్రసాదించే వరదాయిని దీపం. దీపమున్న చోట జ్ఞానం ఐశ్వర్యం కలుగుతాయి. మన సంస్కృతి లో దీప రూపం లో భగవంతుడిని ఆరాదించడం అనాదిగా వస్తున్నది. చంద్రుడు మనసుకి ప్రతీక.పౌర్ణమి నాడు చంద్రుడు పూర్ణత్వాన్ని చేరుకున్నట్లే మనసు కూడా జ్ఞాన పూర్ణం కావాలనేదే ఈ కార్తీక పౌర్ణమి పండుగ యొక్క ఆంతర్యం.
హరిహరులిద్దరికీ కార్తీక పౌర్ణమి అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజన దీప దానం చేస్తే సకల పాపలు తొలగి, మోక్షం కలుగుతుందని చెబుతారు. దీని వల్ల సమస్త జ్ఞానం కలుగుతుందని, సకల సంపదలు సిద్ధిస్తాయని ప్రతీతి. కార్తీక మాసం లో చేసే దీప దానం వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. కార్తీక పౌర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి. ఏడాదంతా దీపం పెట్టని పాపం ఇవాళ దీపం పెడితే ఆ పుణ్యం లభిస్తుందని పెద్దలు చెప్తారు. గంగా,గోదావరి మొదలైన పుణ్య నదుల్లో కార్తీక దీపాలను వదలడం కన్నుల పండుగ గా జరుపుతారు.
కార్తీక పౌర్ణమి రోజున హరుడు త్రిపురాసురున్ని సంహరించినట్లుగా పురాణాల ఆధారం గా తెలుస్తుంది. ఈ విజయాన్ని సంస్మరిస్తూ స్త్రీలు నేటి రాత్రి తులసి చెట్టు వద్ద 365 వత్తులను నేతిలో ముంచి దీపం వెలిగిస్తారు. ఈ పవిత్ర దినాన విష్ణువాలయం లో స్థంబదీపం పెట్టినవారు శ్రీమహవిష్ణువు కి ప్రీతివంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచాలవుతాయని విశ్వసిస్తారు. స్థంబ దీపం పెట్టని వారి పితృదేవతలకు నరక విముక్తి కలగదంటారు. ఈ రోజున ధ్వజస్థంభం పైన నందా దీపం వెలిగిస్తారు.
జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కూడా ఇవాళ జరుపుతారు. శివ కేశవ బేదం లేని పరమ పవిత్రమైన మాసం లో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలతోరణ దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయి. జ్వాల తోరణ భస్మం ధరిస్తే బూత ప్రేత పిశాచ బాధలన్ని నివారణవుతాయి. కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు, పశుపక్షాదులకు, క్రిమికీటకాలకు సైతం పునర్జన్మ ఉండదని ప్రతీతి.
every woman works sexy jobs for women.