ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం

 

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యం

శ్రీ మహావిష్ణువు తో ముడి పడిన తిథి కావున దీనిని వైకుంఠ ఏకాదశి అని మొక్షైక ఏకాదశి అని అంటారు. ముక్కోటి ఏకాదశి, ఎంతో పుణ్యప్రదమైనదని పురాణాల ద్వారా తెలుస్తుంది.  ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ఇటువంటి ఏకాదశులు మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి. అధిక మాసం వచ్చిన సంవత్సరం లో ఇరవై ఆరు వస్తాయి. మన ఆరు నెలలు,  దేవతలకు పగలు  మరో ఆరు నెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశి నాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే, చీకటి రాత్రి నుంచి వెలుగులు ప్రసరించే పగటి లోకి వస్తారు. స్వర్గ ద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణువాలయాల లో ఉత్తరం వైపు ఉన్న ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ద్వారం నుండి భక్తులు శ్రీ మహావిష్ణువును దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం గా భావిస్తారు.

ఉత్తరాయణ ప్రారంభదినమైన ఈ ఏకాదశి ని ముక్కోటి ఏకాదశి గా పిలవబడుతుంది. ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించినది. అప్పటి నుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు ఈ ధనుర్మాస ఆరంభం నుండి తెరచుకొంటాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున గరుడ వాహనుడైన శ్రీ మహావిష్ణువు ఉత్తరద్వారాన దర్శనమిస్తాడు. అత్యంత మనోహరమైన ఈ రూపుని దర్శించుకోవడానికి సర్వ దేవతలు తరలివస్తారు. ఇదే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠ ద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తర ద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజు ఉపవాసం ఉండడం, విష్ణు పూజ విశేష ఫలితానిస్తాయి. ఈరోజు గోపూజ చేయడం విశిష్టమైనది. విష్ణువు సన్నిధి లో ఆవు నేతితో  దీపం వెలిగిస్తే సర్వ పాపాలు హరించి అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. 

melhor casa de apostas

Download our Mobile App

To stay connected with us, download our mobile Apps..

  • Download
  • Download