చైత్రశుద్ధ నవమి నాడు ఐదుగ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నకాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం ‘శ్రీరామనవమి’ గా విశేషంగా జరుపుకుంటాం. చైత్ర శుద్ద నవమి నాడు శ్రీ రామ చంద్రుని జన్మదినోత్సవం, కల్యాణం మరియు పట్టాభిషేకం ఆనందోత్సవాలతో జరుపుకొంటారు విశ్వశాంతికి సమాజ ప్రగతి కీ ధర్మమొక్కటే మార్గమని రాముడు ఆచరించి చూపించాడు. కుటుంబ వ్యవస్థ ఆదర్శ జీవనానికి ప్రతీక శ్రీరామ చంద్రుడు. అందుకే లోకానికి ఆరాధ్యుడయ్యాడు.
పండుగ అనగా మహాత్ముల మరియు విషయము యొక్క విశిష్టత ను చరిత్రను తెలియచేసే సంప్రదాయం. మన పండుగలు ఎప్పుడు వస్తాయో ఆయారోజులలో మనం భగవంతునికి నివేదన చేసే ఆహార పదార్దములు ఆ కాలం లో ప్రకృతిపరం గా మనం ఏ ఏ ఆహారాలు తీసుకోవాలో తెలియచెప్పుటకు మన పూర్వీకులు, ఋషులు పరిశోధించి మనకు అందించిన ఆరోగ్య సూత్రాలు.
ఎండలు చాలా తీవ్రం గా ఉండి వేడి ఎక్కువ గా ఉండే సమయం, కావున శరీరాలు ఉష్ణోగ్రతల ప్రభావం వలన నిస్సత్తువగా మరియు తొందరగా అలసి పోతుంటాయి. ఉదరకోశ వ్యాదులు ఎక్కువ వచ్చే సమయం. వేసవి తాపం, దాహం చాలా ఎక్కువ ఉంటాయి. కావున మన పెద్దలు క్రింది ఆహారాన్ని భగవంతునికి నివేదన చేసి మనం స్వీకరించాలి
వడపప్పు (పెసర పప్పు) మరియు నిమ్మరసం నిస్సత్తువను దూరం చేసి శక్తి ని ఇచ్చి చలువ చేస్తుంది. మంచి బుద్ది ని ప్రసాదిస్తుంది. దాహం తీరుస్తుంది.
బెల్లం మిరియాలు వేసి చేసే పానకo, ఇది వడ దెబ్బ మరియు ఉదరకోశ వ్యాధులను మరియు వేడి వలన కలిగే జలుబు జ్వరములను దూరం చేస్తాయి. కిరణి (కర్బూజా) పండు, పుచ్చకాయ శరీరమునకు చలువ చేసి దాహార్తిని దూరం చేస్తాయి.
చలువ పందిళ్ళు - శ్రీ రామనవమి బ్రహ్మోత్సవముల పేరుతో చలువ పందిళ్ళు వేసి ప్రచండ సూర్య కిరణాల నుండి రక్షణ కల్పిస్తాయి.
విసనకర్ర - మనం వాడే ప్యాన్లు అన్ని ప్రాంతములకు తీసుకు వెళ్ళలేము. కావున చల్లని గాలి కొరకు విసన కర్ర ను వాడుతారు.
Lopebet Live https://lope-bet24.in/live/ offers a wide range of live games with real dealers, which provides an exciting gaming experience for players. Thanks to high-quality broadcasts and a variety of games, users can enjoy a realistic casino atmosphere from anywhere