ధన్వoత్రి జయంతి
ఆశ్వయుజ మాసం బహుళ త్రయోదశి రోజున ధన్వoత్రి జయంతిని జరుపుకొంటారు. దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మధనం చేసినప్పుడు చేతిలో అమృత కలశం తో శ్రీ మహావిష్ణువు కి ప్రతి రూపం గా నాలుగు భుజాలతో ధన్వoత్రి ఉద్భవించాడు. అమృత కలశం లో సమస్త శారీరిక, మానసిక, అజ్ఞానాంధకార రోగాల కు ఔషదాలు నిండి ఉంటాయి. వైద్య విద్య కు ఆది దేవుడైన ధన్వoత్రి పూజ తప్పక ఆచరించాలి.
ఈ రోజున ఎవరైతే శ్రీ మహావిష్ణువు ని సహస్రనామాలతో , తెల్లటి పూలతో లేదా తులసి దళాల తో అర్చించి , పాయసాన్ని నివేదన చేసి పూజిస్తారో వారికి సమస్త రోగాలు తొలగి పోయి ఆరోగ్యం చేకూరుతుంది. నివేదించిన పాయసాన్ని నలుగురి కి ప్రసాదం గా పంచాలి. శరీరం రోగ భూయిష్టమై ఉంటే మానవుడు ఏదీ సాధించలేడు. అనారోగ్య మైన శరీరం మనస్సును చంచలత్వానికి గురి చేస్తుంది. ఈ రోజున ఎవరైతే ఇంటి ముంగిట్లో దీపాలు వెలిగించి ధన్వoత్రి ని పూజిస్తారో వారికి సంపూర్ణ ఆరోగ్యం తో పాటు అపమృత్యు దోషాలు కూడా తొలగుతాయి.
ధన్వంతరి జయంతి ముందు రోజు రాగి పాత్రలో తులసి ఆకులు వేసి పక్క రోజు సూర్యోదయాన్నే లేచి శుచి అయ్యి ధన్వంతరి మంత్రాన్ని జపించి ఆ నీటిని తాగాలి దీనివలన, యశస్సు, బుద్ది, ఆత్మ విశ్వాసం, బుద్ది చాతుర్యం మెరుగుపడతాయి.