కుంభం
ఆదాయం-8, వ్యయం-14, రాజపూజ్యం-7, అవమానం-5
వీరికి ఏల్నాటి శని చివరి దశకు చేరుకుంది.
అయితే శని సువర్ణమూర్తి కావడం శుభకరం.
గురు సంచారం కూడా శుభదాయకమే.
ఇక జన్మ రాశిలో రాహువు, సప్తమంలో కేతువు సంచారం ప్రతికూల అంశాలు.
మొత్తానికి వీరికి శని, గురులు మంచి ఫలితాలు ఇస్తారు.
ధనానికి లోటు రాదు.
ఎవరిపైనా ఆధారపడకుండా వ్యవహారాలు చక్కదిద్దుకుంటారు.
ఒక సమాచారం మీకు విశేష లాభాన్నిస్తుంది.
ఇంట్లో శుభకార్యాల హడావిడి పెరుగుతుంది.
బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి.
భార్యాభర్తల మధ్య నెలకొన్న అపోహలు తొలగుతాయి.
వాహనాలు, ఖరీదైన ఇళ్లు కొనుగోలు చేస్తారు.
నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరే కాలం.
సమాజంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి.
అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది.
ఎక్కువ సమయం ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కోర్టు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశముంది.
అక్టోబర్ నవంబర్ మధ్య కాలంలో ఆరోగ్యం ముఖ్యంగా నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధిస్తాయి.
వ్యాపార, వాణిజ్య రంగాలు క్రమేపీ పుంజుకుని లాభాలు ఊరటనిస్తాయి.
కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు.
ఉద్యోగులకు పదోన్నతులతో కూడిన బదిలీలు ఉంటాయి.
అదనపు పని భారం తగ్గవచ్చు.
పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే సూచనలు.
వీరి మాటకు తిరుగు ఉండదు.
కళాకారుల కలలు ఫలిస్తాయి. మంచి గుర్తింపు లభిస్తుంది.
పురస్కారాలు అందుకుంటారు.
విద్యార్థులకు రెండుమూడు అవకాశాలు దక్కవచ్చు.
వ్యవసాయదారులకు రెండవ పంట లాభసాటిగా ఉంటుంది.
శనికి తైలాభిషేకాలు, దుర్గాదేవికి కుంకుమార్చనలు చేయడం ఉత్తమం.
నిత్యం ఆదిత్యహృదయ పఠననం మంచిది.
అదృష్టసంఖ్య-8.