కుంభం ( జనవరి 20 - ఫిబ్రవరి 18 )
మీ కృషి, పట్టుదలతో క్లిష్టమైన కార్యాలను సైతం పూర్తి చేస్తారు.
ఖరీదైన వస్తువులు, వాహనాలు కొంటారు.
రాబడి అనూహ్యంగా పెరిగి ఉత్సాహంగా అడుగులేస్తారు.
పరిచయాలు మరింతగా పెరుగుతాయి.
జీవిత భాగస్వామి ఆరోగ్యం కుదుటపడి మనశ్శాంతి పొందుతారు.
రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లు ఎట్టకేలకు లాభాలు దక్కించుకుంటారు.
కొన్ని కేసుల నుంచి బయటపడే అవకాశం.
ఇతరులు చేసిన పొరపాట్లు మీపై మోపేందుకు యత్నిస్తారు. అప్రమత్తతతో మెలగాలి.
ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించడం మంచిది.
వ్యాపారులు, వాణిజ్యవర్గాలకు లాభాలు కనిపిస్తాయి.
పారిశ్రామిక, రాజకీయవేత్తలు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు.
కళాకారులకు ద్వితీయార్ధం నుండి మరిన్ని అవకాశాలు రాగలవు.
విద్యార్థులు, క్రీడాకారులకు అనూహ్యమైన విజయాలు.
జనవరి, మే, ఆగస్టు, సెప్టెంబర్ నెలలు సాధారణ స్థాయిలో ఉంటాయి.
అదృష్ట సంఖ్య–8