మేషం (మార్చ్ 21 - ఏప్రిల్ 19)
మనోబలం, సంకల్ప బలం మీకు తోడుగా నిలుస్తాయి.
సుదీర్ఘకాలంగా మీకు సవాలుగా నిలుస్తున్న ఒక సమస్య నుండి గట్టెక్కుతారు.
ఆప్తుల ద్వారా మీకు పరిపూర్ణ మద్దతు లభిస్తుంది.
సామాజిక కార్యక్రమాల పై మరింత దృష్టి సారిస్తారు.
తరచూ ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడాల్సి వస్తుంది.
అయితే వెనువెంటనే ఉపశమనం పొందుతారు.
చిత్రవిచిత్రమైన రీతిలో కొన్ని అద్భుత సంఘటనలు చూస్తారు.
మీ ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు.
కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఈ ఏడాది కొంత వేగం పుంజుకునే అవకాశం.
ముఖ్యమైన కార్యక్రమాలను పూర్తి చేయడంలో అవరోధాలు తొలగుతాయి.
మీ స్వంత ఇంటి కల నెరవేరవచ్చు.
తీర్థయాత్రలు, పర్యాటక ప్రదేశాలు సందర్శిస్తారు.
ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుంటూ అవసరాలను తీర్చుకుంటారు.
కొందరు మిమ్మల్ని నమ్మించి వంచించే ప్రయత్నం చేసి విఫలమవుతారు.
వ్యాపారస్తులు మొదటి అర్థ సంవత్సరం సాధారణంగానూ, అనంతరం అధిక లాభాలు ఆర్జిస్తారు.
కొందరు కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.
ఉద్యోగాలలో ఎటువంటి ఒత్తిడులు, సమస్యలున్నా మనోబలంతో అధిగమిస్తారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు, వైద్యరంగాల వారికి విశేష పురస్కారాలు, తగిన గుర్తింపు లభిస్తుంది.
వ్యవసాయదారులు కొత్త పెట్టుబడులను స్వీకరిస్తారు.
విద్యార్థులు, మహిళలకు శుభవార్తలు.
ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో అన్ని విషయాలలోనూ కొంత అప్రమత్తత అవసరం.
అదృష్ట సంఖ్య–9.