కర్కాటకం ( జూన్ 21 - జులై 22)
ఇంతకాలం నిరీక్షణ ఫలించి నిరుద్యోగులు మంచి ఉద్యోగాలు సాధిస్తారు.
అనుకున్న కార్యక్రమాలను స్వల్ప ఆటంకాలు అధిగమిస్తూ పూర్తి చేస్తారు.
మీ గతం గురించిన విశేషాలు స్నేహితులతో పంచుకుంటారు.
అయినవారితో ఆస్తి తగాదాలు నెలకొనే అవకాశం.
అయితే, ప్రతి విషయంలోనూ నిదానమే ప్రదానం అన్న సూత్రాన్ని పాటించడం మంచిది.
బంధువర్గం మీ పై మరింతగా ఒత్తిడులు పెంచుతారు.
ద్వితీయార్థంలో ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి.
కొన్ని సమస్యలు వెంటాడుతూ మీ సహనాన్ని పరీక్షిస్తాయి.
ఒక సంఘటన ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
కొత్త కాంట్రాక్టులను ఎట్టకేలకు దక్కించుకుంటారు.
ఆర్థిక పరిస్థితి స్థిరత్వం కలిగి ఉంటుంది.
రావలసిన డబ్బు కొంత అంది అవసరాలు తీరతాయి.
వ్యాపార లావాదేవీలపై పట్టు సా«ధించినా
ఏడాది చివరిలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు, అప్రమత్తత అవసరం.
ఉద్యోగాలలో ఊహించని మార్పులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులకు మరింత రాణింపు ఉంటుంది.
వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి.
విద్యార్థులు తాము నిర్దేశించుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
జనవరి, ఫిబ్రవరి, జూన్,అక్టోబర్ నెలలు కొంత పరీక్షగా ఉంటాయి.
అదృష్ట సంఖ్య–2