మిథునం (మే 21 - జూన్ 20 )
ఎటువంటి ప్రయత్నం చేసినా మొదట ఆటంకాలు, తదుపరి విజయాలు ఉంటాయి.
ఆత్మవిశ్వాసం, పట్టుదలతో వ్యవహారాలను చక్కదిద్దుతారు.
మీలో పోటీతత్వం పెరిగి కొన్ని వృథా ఖర్చులు చేస్తారు.
ఆదాయానికి మొదట్లో ఇబ్బందిపడ్డా క్రమేపీ అధిగమిస్తారు.
ప్రముఖులు మీకు పంపిన వర్తమానంతో ఉత్సాహంగా గడుపుతారు.
విద్యార్థులు, నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి.
స్థిరాస్తి వివాదాలు ద్వితీయార్ధంలో పరిష్కారమవుతాయి.
ద్వితీయార్థమంతా శుభకార్యాల నిర్వహణ, ఇంట్లో సందడి వాతావరణం
ఉద్యోగ లాభాలతో గడిచిపోతుంది.
కొన్ని కేసుల నేర్పుగా నుంచి గట్టెక్కుతారు.
కాంట్రాక్టుల విషయంలో అనుకున్నది సాధిస్తారు.
తరచూ తీర్థయాత్రలు చేస్తారు.
వ్యాపార లావాదేవీలు చాకచక్యంగా నిర్వహించడంలో మీకు మీరే సాటి అనిపించుకుంటారు. లాభాలకు కొదవ ఉండదు.
ఉద్యోగాలలో జరిగే మార్పులతో ప్రయోజనం కలుగుతుంది.
ఉన్నతాధికారులు కూడా మీ పనితనాన్ని గుర్తిస్తారు.
పారిశ్రామికవేత్తలు, వైద్యులు,సాంకేతిక నిపుణులు తమలోని ప్రతిభ చాటుకుంటారు.
వ్యవసాయదారులకు పెట్టుబడులకు మార్గం దొరుకుతుంది.
మహిళలకు స్థిరాస్తి లాభాలు ఉండవచ్చు.
జనవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్ నెలల్లో కొత్త సమస్యలు,
మనశ్శాంతి లోపించడం, అనారోగ్యం, వృథా ఖర్చులు ఉండవచ్చు.
అదృష్ట సంఖ్య–5.