మీనం ( ఫిబ్రవరి 19 - మార్చ్ 20 )
వీరికి అంతా అనుకూలంగా కనిపించినా మధ్యలో కొన్ని చికాకులు తప్పవు.
ఆర్థికంగా కొన్ని వెసులుబాట్లు కలిగి రుణభారాలు తగ్గుతాయి.
కార్యక్రమాలలో విజయాలు సాధిస్తారు.
కుటుంబ విషయాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు.
ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలు చేసేందుకు సన్నాహాలు చేస్తారు.
ఆత్మీయులు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది.
కొన్ని వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు.
కాంట్రాక్టర్లు, రియల్‌ఎస్టేట్ వర్గాలకు విశేషంగా కలిసివచ్చే సమయం.
వ్యాపారులు, వాణిజ్యవర్గాలు ఉత్సాహంగా లావాదేవీలు చేపడతారు.
కళాకారులు, పారిశ్రామికవేత్తలకు అనుకూల పరిస్థితులు.
రాజకీయవేత్తలకు శ్రమానంతరం పదవీయోగం, విశేష ప్రజాదరణ.
క్రీడాకారులు ద్వితీయార్థంలో కొన్ని విజయాలు సాధిస్తారు.
ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్, అక్టోబర్‌నెలలు ప్రతికూలంగా ఉంటాయి.
అదృష్ట సంఖ్య–3