వృషభం
ఆదాయం- 11, వ్యయం-5, రాజపూజ్యం- 1 అవమానం-3
ఈ రాశి వారికి శని,గురుల అనుకూల సంచారం బాగా కలిసి వస్తుంది.
రాహువు కూడా కొంతమేర శుభ ఫలితాలు ఇస్తాడు.
ఆదాయం సమృద్ధిగా ఉండి ఉత్సాహంగా గడుపుతారు.
ఖర్చులను కొంతమేర తగ్గించే చర్యలు చేపడతారు.
సమాజంలో విశేషమైన గౌరవం లభిస్తుంది.
కుటుంబంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితుల వల్ల మనశ్శాంతి లోపిస్తుంది.
మొత్తానికి అన్ని విధాలా గతం కంటే శుభఫలితాలు అధికం.
బంధువుల ద్వారా సహాయసహకారాలు సంపూర్ణంగా అందుతాయి.
వివాహాది శుభకార్యాల నిర్వహణతో ఉత్సాహంగా గడుపుతారు.
వాహనాలు నడిపే వారు∙జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
కొన్ని ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు.
కొన్ని సంఘటనలు మీలో ఆలోచనలు కలిగిస్తాయి.
శాస్త్ర, సాంకేతికరంగాల వారికి విశేషమ గుర్తింపు, విదేశీ పర్యటనలు చేస్తారు.
విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని విధంగా అవకాశాలు రాగలవు.
ఇంటి నిర్మాణాలకు ద్వితీయార్థంలో శ్రీకారం చుడతారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులపై దృష్టి పెట్టి కొత్త సంస్థల ఏర్పాటు పై నిర్ణయాలు తీసుకుంటారు.
లాభాలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు.
ఉద్యోగవర్గాలకు బాధ్యతల నిర్వహణలో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది.
మే అక్టోబర్ మధ్య మార్పులు జరిగే వీలుంది.∙
పారిశ్రామిక, రాజకీయవర్గాల చిరకాల స్వప్నం ఫలిస్తుంది.
కళాకారులకు శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది.
ఏడాది మధ్యలో ఘన విజయాలు చూస్తారు.
వ్యవసాయదారులకు రెండు పంటలూ సానుకూలం.
అక్టోబర్, నవంబర్, జనవరి నెలల్లో కొన్ని సమస్యలు రావచ్చు.
ముఖ్యంగా ఆరోగ్యపరంగా చికాకులు, ధన వ్యయం, మానసిక ఆందోళన వంటి ఫలితాలు ఉంటాయి.
వీరు కేతువుకు పరిహారాలు చేయించుకుంటే మంచిది.
అదృష్టసంఖ్య-6.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.