వృషభం (ఏప్రిల్ 20 - మే 20)
ఈతి బాధలు, సమస్యల నుండి క్రమేపీ బయటపడే శక్తి లభిస్తుంది.
ఎంతోకాలంగా వేధిస్తున్న ఒక వివాదం సర్దుకునే అవకాశాలున్నాయి.
ఆప్తులు, బంధువులు మీ పట్ల ప్రేమ కనబరుస్తారు.
స్థిరాస్తి వివాదాల పై చొరవ తీసుకుని పరిష్కరించుకుంటారు.
మీరు చేపట్టే కార్యక్రమాలన్నీ శ్రమపడ్డా పూర్తి కాగలవు.
అపవాదుల నుండి విముక్తి లభిస్తుంది, ప్రశంసలు సైతం అందుతాయి.
మీ మౌనమే మీకు ఆయుధంగా మారి సహకరిస్తుంది.
విద్యార్థులు పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి.
తరచూ ప్రయాణాలు చేయడం ద్వారా కొంత ఆరోగ్య సమస్యలు రావచ్చు.
ఉద్యోగ ప్రయత్నాలు మరింత ఫలించి తగిన లబ్ధి పొందుతారు.
ఆర్థిక పరిస్థితిలో పెనుమార్పులు ఉండవచ్చు.
మీకు రావలసిన డబ్బు ఊహించని రీతిలో అందవచ్చు.
వ్యాపార లావాదేవీలను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించి మీరే స్వయం నిర్ణయాలు తీసుకుంటూ లాభపడతారు.
ఉద్యోగాలలో ప్రమోషన్లు, కొందరికి ఇంక్రిమెంట్లు రావచ్చు.
రాజకీయవేత్తలు, కళాకారులు, టెక్నికల్ రంగాలకు చెందిన వారు తెలివితేటలతో విజయాల బాటపడతారు.
వ్యవసాయదారులు పంటల సాగులో ఫలితం కనిపిస్తుంది.
మహిళలకు పుట్టింటి వారి నుంచి కొంత లబ్ధి చేకూరే అవకాశం.
ఏప్రిల్, ఆగస్టు, నవంబర్, డిసెంబర్ నెలలు పరీక్షా సమయం.
తగిన ఆలోచనలతో నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి.
డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు.
అదృష్ట సంఖ్య–6.