కన్య
ఆదాయం-14, వ్యయం-2, రాజపూజ్యం-6, అవమానం-6
ఈ సంవత్సరం విశేష గురు బలంతో విజయాలబాటలో దూసుకువెళతారు.
సప్తమంలో శని కొంత ప్రతికూలం కాగా, షష్టమంలో రాహువు, వ్యయంలో కేతువు ప్రభావం మిశ్రమంగా ఉంటుంది.
మొత్తానికి వీరు ఎదురులేని విధంగా గడుపుతారు.
ఆర్థిక విషయాలలో మరింత ప్రగతి సాధిస్తారు.
ఒకరి ద్వారా ఆశలు వదులుకున్న ధనం కూడా అందుతుంది.
కోర్టు వ్యవహారాలలో అనుకూల తీర్పులకు అవకాశం.
మీ ఆలోచనలు కుటుంబసభ్యులు ఆచరిస్తారు.
కొన్ని సమస్యలు వీడి మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
ఆస్తులు కొనుగోలులో ముందుంటారు.
ఈ ఏడాది గృహ యోగం, వివాహాది శుభకార్యాల నిర్వహణ వంటి వాటికి ఖర్చు చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.
విద్యార్థులు ఊహించని ర్యాంకులు సాధిస్తారు.
వ్యాపార, వాణిజ్యరంగాల వారికి ఇతోధికంగా లాభాలు రాగలవు.
అలాగే, భాగస్వాములతో వివాదాలు తీరతాయి.
ఉద్యోగులకు తాము ఊహించిన దానికంటే అధికంగా లబ్ధి చేకూరుతుంది.
పారిశ్రామికవర్గాల నూతన ప్రాజెక్టులు చేపడతారు.
ఐటీ నిపుణులకు చెప్పుకోతగిన మార్పులు ఉంటాయి.
రాజకీయవేత్తలకు పదవులు రావచ్చు.
కళాకారులు అవకాశాలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.
వ్యవసాయదారుల ఆశలు నెరవేరతాయి.
అయితే సప్తమ శని, వ్యయంలో కేతువు ప్రభావం వల్ల చర్మ, నరాలు, జ్వర సంబంధిత రుగ్మతలు బాధించవచ్చు.
అలాగే, భార్యాభర్తల మధ్య మాటపట్టింపులు నెలకొంటాయి.
తొందరపాటు మాటలు లేకుండా, ఆచితూచి వ్యవహరిస్తూ సాగడం మంచిది.
మే 18వరకు ప్రయాణాలు, ఇతర ముఖ్య వ్యవహారాలలో మరింత జాగ్రత్తలు పాటించాలి.
మిగతా నెలలు అనుకూలమే.
వీరు శని, కేతువులకు పరిహారాలు చేయించుకోవాలి.
శ్రీ దత్తాత్రేయ స్వామి స్తోత్రాలు పఠించండి.
అదృష్టసంఖ్య-5.