కన్య ( ఆగష్టు 23 - సెప్టెంబర్ 22 )
ఆశ్చర్యకరంగా కొన్ని కార్యక్రమాలు మీ ప్రమేయం లేకుండానే పూర్తి చేస్తారు.
అత్యంత విలాసవంతంగా గడుపుతారు.
అందర్నీ ఆశ్చర్యపరిచే విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.
ఆదాయానికి ఈ సంవత్సరం ఇబ్బంది లేకుండానే గడిచిపోతుంది.
తగిన ప్రణాళికతో సిద్ధపడతారు.
వివాహాది శుభకార్యాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తారు.
సోదరులు, మిత్రులు మీపై ఉంచిన బాధ్యతలు సంపూర్ణంగా పూర్తి చేస్తారు.
విద్యార్థులు తమలోని ప్రతిభను నిరూపించుకుంటారు.
వ్యాపారస్తులు తమ నైపుణ్యతతో అభివృద్ధి పథంలో పయనిస్తారు.
ఉద్యోగాలలో మీ హోదాలు మరింత పెరిగి ఉన్నతస్థానం అలంకరిస్తారు.
రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది.
వీరి అంచనాలు నిజమవుతాయి.
కళాకారులు సైతం కొత్త అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు.
కొన్ని శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు.
మార్చి, ఏప్రిల్, ఆగస్టు, డిసెంబర్ నెలల్లో ఏమరుపాటు తగదు. లేనిపోని వివాదాలు.
అదృష్ట సంఖ్య....5