మేషం
నూతన ఉద్యోగావకాశాలు.
సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తారు.
అందరిలోనూ విశేష ఆదరణ, గౌరవం లభిస్తుంది.
ఆలోచనలను ఎట్టకేలకు అమలు చేస్తారు.
కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు.
రాబడి మీ ఊహలకు తగినంతగా సమకూరుతుంది.
తీర్థ యాత్రలు చేస్తారు.
వ్యాపారాలలో లాభాలు దక్కవచ్చు.
ఉద్యోగులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి..
పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారి కృషి ఫలిస్తుంది.
విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి.
మహిళలకు సంతోషకరమైన వార్తలు.
అనుకూల రంగులు...... గోధుమ, కాఫీ.
ప్రతికూల రంగు...పసుపు.
కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.