తుల
ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
నిరుద్యోగులు ఉద్యోగాలు అందుకుంటారు.
కొందరు స్నేహితులు మీకు మరింత సహాయపడతారు.
కుటుంబంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.
సేవాకార్యక్రమాల పై ఆసక్తి చూపుతారు.
ముఖ్య కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు.
రావలసిన సొమ్ము సమకూర్చుకుని అవసరాలు తీర్చుకుంటారు.
వాహనాలు, ఆభరణాలు కొంటారు.
వ్యాపారాలలో పెట్టుబడులు సాధిస్తారు.
ఉద్యోగులకు వివాదాలు తీరి ఊరట లభిస్తుంది.
క్రీడాకారులు, చిత్రపరిశ్రమ వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.
విద్యార్థులకు అనూహ్యమైన పిలుపు రావచ్చు.
మహిళలు వస్తు, ధన లాభాలు.
అనుకూల రంగులు...... గోధుమ, తెలుపు.
ప్రతికూల రంగు...నేరేడు.
గణేశ్ స్తోత్రాలు పఠించండి.