కన్య
కొత్త రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు.
బం«ధుమిత్రులు మీ ఆశయాలకు విఘాతం కలిగించే వీలుంది.
నిరుద్యోగుల యత్నాలలో కొంత విరామం.
పరిస్థితులు అనుకూలించక కొంత తలవంచక తప్పదు.
మీకంటే చిన్ననారితో మాటపడాల్సి వస్తుంది.
ఇంటాబయటా కొత్త సమస్యలు ఎదుర్కొంటారు.
దేవాలయాల సందర్శనం.
కాంట్రాక్టర్లకు లేనిపోని వివాదాలు.
వ్యాపారవేత్తలకు ఒత్తిడులు రావచ్చు.
ఉద్యోగులు విధుల్లో అప్రమత్తంగా మెలగాలి.
రాజకీయవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి కొన్ని ఇబ్బందులు రావచ్చు,
విద్యార్థులకు అంచనాలు కొంత తప్పవచ్చు.
మహిళలకు కుటుంబ సభ్యులతో వైరం.
అనుకూల రంగులు..... గోధుమ, పసుపు.
ప్రతికూల రంగు...తెలుపు.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.