మేషం
అనుకున్న కార్యక్రమాలలో విజయం సాధిస్తారు.
ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది.
భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.
స్నేహితులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు.
కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు.
కొద్దిపాటి రుగ్మతలు ఇబ్బంది కలిగిస్తాయి.
వ్యాపారులకు అంచనాలు ఫలించి లాభాలు దక్కుతాయి.
ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు.
కళాకారులకు సంతోషకరమైన సమాచారం.
వైద్యులు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది.
వారాంతంలో ఆకస్మిక ప్రయాణాలు.
ఒప్పందాలు వాయిదా వేస్తారు.